బిజినెస్

పెద్దగా ప్రభావం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: అల్యూమినియం దిగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన 10 శాతం అదనపు సుంకం వల్ల ప్రపంచ అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం పరిమితమేనని ఒక నివేదిక పేర్కొంది. ఇటీవల అమెరికా, తమదేశంలోకి దిగుమతి అయ్యే విదేశీ అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించినా, కెనడా, మెక్సికోలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లోటులో ఉన్నందువల్ల, యుఎస్ విధించిన సుంకం ప్రభావం పెద్దగా ఉండబోదు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం కూడా, కాలుష్యానికి కారణమవుతున్న, చట్టవిరుద్ధ అల్యూమినియం సంస్థల ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా కొంతమేర ఇందుకు కారణం. అమెరికా ప్రభుత్వ ప్రకటన తర్వాత అల్యూమినియం ప్రీమియం ఆ దేశంలో 21 శాతం పెరగ్గా, ఆసియాలో 10 శాతం పెరిగింది. అయినప్పటికీ ప్రపంచంపై దీని ప్రభావం ఉండబోదని ఆ నివేదిక పేర్కొంది. వివిధ దేశాల్లో ఉత్పత్తి అయ్యే అల్యూమినియంను, అమెరికాయేతర దేశాలు దిగుమతి చేసుకోగలవని ఇక్రా రేటింగ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2017లో చైనాలో అల్యూమినియం ఉత్పత్తుల్లో 1.4 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కోత విధించగా, 2018లో అది 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగలదని ఇక్రా రేటింగ్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు జయంత రాయ్ తెలిపారు. అమెరికా వాణిజ్య ఆంక్షలు, ప్రపంచ వ్యాప్తంగా అల్యూమినియం సరఫరా చైన్‌లో మార్పులు సంభవిస్తాయే తప్ప, ప్రతికూల ప్రభావం ఏమీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు.2016లో అమెరికా మొత్తం 3.96మిలియన్ మెట్రిక్ టన్నుల అల్యూమినియంను దిగుమతి చేసుకుంది. ఇందులో 2.30 మిలియన్ మెట్రిక్ టన్నులు కెనడా నుంచి మిగిలిన 1.66 మిలియన్ మెట్రిక్ టన్నులు రష్యా, ఖతార్, యూఏఈ, అర్జెంటీనా వంటి దేశాలనుంచి దిగుమతి అయింది.