సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

532 జ్ఞాన హీనుడవై నీ వధర్మ గతి జ
రించ వారించు ధర్మాత్ము లొక్కరైన
లంకలో లేర? లేక వారల సుయోక్తు
లొక్కటైనను నీ చెవి కెక్కలేద

533.నీ దురాచార వర్తన చేత సర్వ
సంపదల నలరారు నీ రాజ్యలక్ష్మి
శీఘ్రమే నశించును దూరదృష్టిలేని
పాపకర్ములొనర్చును పతితు నిన్ను

534.నీకు జీవించ వలెనను నాశయున్న
రామచంద్రుని శరణు వేడుము దయాస
ముద్రుడాయన నిన్ను క్షమించి విడుచు
లేనిచో నీకు మరణమే లిఖితమింక

535.ఇంద్ర వజ్ర ఘాతమును తప్పించుకొనగ
వచ్చు, యముని పాశము విడిపించుకొనగ
వచ్చు, రామ బాణమును దప్పించుకొనగ
నెట్టి ప్రాణికి దరముగ ఆనట్టి దసుర

536.రామ గరుడుడు రాక్షస సర్పములను
వాడి బాణములను గోళ్ళ వ్రయ్య జేసి
వామనుడు మూడు పదముల దైత్యలక్ష్మి
జేకొనినయట్లు దోడ్కొనిపోవు నన్ను

537 నాడు దశరథ పుత్రు లాశ్రమము నందు
లేని సమయము జూచి నన్నపహరించి
తెచ్చితివి గాన జీవించి యుంటి నీవు
లేనిచో నిన్ను బరి మార్చు వారల పుడె

538 పెద్దపులి బారి బడిన జంబుకము రీతి
నయ్యెదవు రఘువీరుని యెదుట నీవు
యెచట దాగిన నిను కడతేర్చి నన్ను
శీఘ్రమే గొని పోవు నయోధ్య కతడు

539 సవన భూమి నెవ్వరు లేని సమయ ముందు
శునక మాయజ్ఞ శేషము నపహరించి
దెచ్చి నట్లు నన్నపహరించి గొని వచ్చి
తీవు దీని ఫలితము పొందెదవు నీవు

540 రావణా! నన్ను ఇంత దుర్బుద్ధితోడ
జూచు నీ నేత్రము ల్ప్రేలి నాల రాలి
పడవదేమి నాతో నిట్ల సభ్యవచన
ములను బల్కెడు నీ నాల్క జీలదేమి?

541 సీత బల్కిన పరుష భాషణములు విని
క్రోధమణచుక లంకేశు‘‘డోధరణిజ!
ప్రేమతో నిన్ను నాదాగా నొనర్చు
కొనదలంచు నన్ను పరాభవించు చుంటి

542
నీకు నిచ్చిన గడువిక రెండు నెలలు
అంతలో నన్ను జేపట్ట రాణి వౌదు
వట్లుగాకున్న నిను వంటవారు జంపి
వండి పంపుడు రుదయపు తిండి జేసి’’

543. రావణుని మాటలకు జనకావనీశు
తనయ ‘‘రావణా! విను నిన్ను రుూ క్షణంబె
భస్మరాశిగ జేతు నా భర్త యాజ్ఞ
లేని కారణమున నిటు లుండవలసె

544. శూరుడవు కుబేరునకు సోదరుడవీవు
రాక్షసకులాధినేతవు రామచంద్రు
మోసగించి నన్నపహరించు తలపెట్లు
బుట్టు నీ వినాశము దాపురింపకున్న’’

545. అనుచు బల్కుచున్న అవనిజాతను జూచి
‘‘మూర్ఘురాల! నిన్ను నిపుడె సంహ
రించువాడ’’ ననుచు భీకరాకారుడై
పాదతాడనమున భూమి యదర

546. అరుణ నేత్రము లింకను నెఱ్ఱవార
క్రోధవీక్షణముల పృధ్విపుత్రి జూచి
కుపితభుజగమువలె బుస గొట్టుచున్న
రాక్షసేశ్వరు దరిచేరి ధాన్యమాలి

547. ‘‘ప్రాణనాధ! కృంగి కృశించి యున్న రుూమ
నుష్య కాంతతో నీ కెందు కయ్య నిన్ను
యిష్టపడని మగువతొనీ కిష్ట సుఖము
గలుగ నేరదు తాపము మిగులుగాని

-- టంగుటూరి మహాలక్ష్మి