మెయిన్ ఫీచర్

అందానికి ఆరు సూత్రాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం ఎవరికైనా ముఖ్యమే కాని ఆడవారు అందం పట్ల మరింత ఆకర్షణ కలిగిఉంటారు. వారి శరీరభాగాలైనా, కేశ సౌందర్యమైనా, అదీ లేకపోతే వారు ధరించే దుస్తులు కూడా అందంగా ఉండాలనే అనుకుంటారు. అన్నీ అందాలను చక్కగా బేరీజు వేసుకొన్నా ఒక్కోసారి అందంతో పాటు ఉండాల్సిన ఆరోగ్యం కరువు అవుతుంది. అందుకే ఆందంతోపాటు ఆరోగ్యమూ ముఖ్యమే. అందులోను అతివలకు మరింత ముఖ్యం. కనుక వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం.
పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు విధంగా శరీర వ్యాయామం చేసుకుంటూ, శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పోషించే విటమిన్సు, న్యూట్రిషన్ ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఎంత తిన్నామన్నది కాదు ముఖ్యం. ఏరకమైన ఆహారం తీసుకున్నామన్నదాన్ని గురించి ఆలోచించాలి. అంతేకాదు మనం తీసుకునే ఆహారం బలవర్థకమైనది కాకపోయినా అనారోగ్యాన్ని కలిగించేది కాకుండా ఉంటే మేలు. సాధ్యమైనంత వరకూ బ్యాలెన్సుడు డైటు తీసుకోవాలి.
తీసుకునే ఆహారంలో ప్రొటీను కార్బోహైడ్రేట్స్, విటమిన్సు, మినరల్స్, క్రొవ్వు పదార్థాలు వుండాలి. టిష్యూలు పాడైతే వార్థక్యం వస్తుంది. ప్రొటీన్స్ శరీరానికి ఎంతో ఉపకారం చేస్తాయి. శరీరం ముడతలు పడకుండా కాపాడబడుతుంది. జుట్టు వూడకుండా దృఢంగా వుంటుంది. ప్రొటీన్సు గనుక మన శరీరంలో తగ్గితే చర్మం త్వరగా ముడుతలు పడుతుంది. ముఖకాంతి తగ్గిపోతుంది. కనుక ముఖంలోని గ్లామర్ తగ్గకుండా వుండాలంటే రోజుకి కనీసం ఎనభై గ్రాముల ప్రొటీన్స్ మన శరీరంలోకి వెళ్లాలి.
ప్రోటీన్స్ అనేవి చికెన్, ఫిష్ మొదలైన మాంసాహారాల్లోను, తరువాత ఛీజ్‌లోను, చిలికిన పాలలోనూ, కోడిగ్రుడ్లలోనూ ప్రొటీన్స్ లభిస్తాయి. శాఖాహారాలైన పప్పుదినుసులలోనూ, ధాన్యము, గోధుములు, రాగులలోనూ ప్రోటీన్స్ లభిస్తాయి.
శరీరానికి కార్భోహైడ్రేట్స్ కూడా శరీరానికి అవసరమే. ఇవి శరీర దారుఢ్యానికి క్రొవ్వు ఎంతోఅవసరం. క్రొవ్వు పదార్థాలను కూడా మితిమీరి తినకూడదు. అయితే అసలు తీసుకోకుండా వుండకూడదు. తగినంతగా క్రొవ్వు పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. తద్వారా అందంగా వుండవచ్చు.
* మనం తీసుకునే ఆహారంలో హెచ్చ్భుగం పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ వుంటాయి.
* ఎక్కువగా రిఫైండ్ షుగర్స్‌ను వాడకూడదు. ఇది ఎక్కువగా చాక్‌లెట్స్‌లో, ఐస్‌క్రీములలో, కేకులలో, తీపి పదార్థాలలో ఇది వుంటుంది. ఇందుకోసం పంచదారకన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు.
* తాజా ఆకుకూరలు ఆరోగ్యానికెంతో మంచిది. టమోటాలు, దోసకాయ, పాలకూర మొదలైన వాటిలో హెచ్చు కాల్షియం వుంటుంది. ఐరన్, కెరోటిన్, రిబోప్లావిన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్‌లు వుంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది.
* ఇక ఏ కాలంలో దొరికే ఆ తాజాపండ్లు ఆరంజి, యాపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యూస్ కూడా మంచిదే. అందులో విటమిన్ సి వుంటుంది. ఇది ఇన్‌ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. ప్రతిరోజు పొద్దునే్న గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని ఓ స్ఫూన్ తేనెను వేసుకొని కలుపుకుని త్రాగితే మంచిది.
* ఎక్కువగా కాఫీ, టీలు త్రాగకూడదు. అతిశీతల పానీయాలు ఆరోగ్యానికి హాని చేస్తాయ. స్వచ్ఛమైన నీరు ఎక్కువగా త్రాగాలి. బాగా చిలికిన మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే.
* ఏదైనా సరే అతిగా తినడం దుర్గుణం. చాలా తేలికైన ఆహారం స్లిమ్‌గా వుండేటట్టు చేస్తుంది. కాని దేనినైనా కొద్దిగా మాత్రమే తీసుకొంటే అటు ఆరోగ్యమూ అందమూ అతివల సొంతం.
మ్యాచింగ్.. మ్యాచింగ్..
గోర్లకు రంగు వేసుకోవడం ఒకప్పటి ట్రెండ్. ఈ ఫ్యాషన్ ఠకరకాలుగా మారుతూ గోర్లపై రకరకాల బొమ్మలు, కుందన్లు, రాళ్లు అద్దడం వరకు చేరింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పెదవులకు వేసుకునే రంగులనే గోర్లకు వేయడం అంటే రెండూ మ్యాచ్ అయ్యేలా ఉండటం మొదలయ్యింది. ఇదే నేటి నయా ట్రెండ్. గోర్లపై వేసే రంగులతో పాటు డిజైన్లను కూడా అచ్చుగుద్దినట్లు అలాగే పెదవులపై కూడా వేసేస్తున్నారు బ్యూటీషియన్లు. ఇప్పుడు అమ్మాయిలు డ్రస్సుకు తగినట్లు నెయిట్ ఆర్ట్స్, దానికి తగినట్లు లిప్‌స్టిక్ డిజైన్లు.. వీటన్నింటికీ తగినట్లున్న ఆభరణాలు.. మొత్తానికి అంతా మ్యాచింగ్ మయమే..!

-ఛివుకుల