నిజామాబాద్

భానుడి ప్రకోపానికి తల్లడిల్లుతున్న ఇందూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 21: మునుపెన్నడూ లేనివిధం గా భానుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తుండడంతో ఇందూరు ప్రజానీకం తల్లడిల్లిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల గ్రీష్మతాపం తాళలేక బడుగు జీవులు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే వడదెబ్బ ధాటికిగురై ఉమ్మడి జిల్లాలో పది మందికి పైగా మరణించగా, వందలాది మంది అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈదురుగాలులు, అకాలవర్షాలతో వేసవి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా, అది తాత్కాలిక ఊరటగానే మిగిలింది. గడిచిన మూడు రోజుల నుండి ఉష్ణోగ్రతలు మళ్లీ తారాస్థాయికి చేరుకుని ప్రజలను అపసోపాలకు గురిచేస్తున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పులు వీస్తుండడంతో మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల బయటకు వచ్చేందుకు ఏఒక్కరూ సాహసించడం లేదు. అసలు ఉదయం 10గంటలు దాటితేనే రోడ్లపై జన సంచారం కనిపించడంలేదు. రంజాన్ మాసం ప్రారంభమై వారం రోజులు కావస్తున్నప్పటికీ, ఎండల తీవ్రత కారణంగా మార్కెట్ ఇప్పటికీ ఊపందుకోలేదంటే వేసవి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఉదయం ఆరు గంటల నుండి 11గంటల వరకే ఉపాధి పనులను కొనసాగిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నప్పటికీ, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయకపోవడం కూలీల ఉసురుతీస్తోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే నలుగురు కూలీలు వడదెబ్బ తాకిడితో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇళ్ల పట్టునే ఉండే చిన్నారులు సైతం గ్రీష్మతాపానికి లోనై వడలిపోతున్నారు. గడిచిన వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు జిల్లాలో రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం 43డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, వారంరోజుల క్రితం రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీలుగా నమోదైంది. అకాల వర్షాలతో వాతావరణం కాస్తంత చల్లబడిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే మళ్లీ భానుడి భగభగలు మొదలవడంతో ప్రజలు వేసవితాపం తాళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని కనబరుస్తూ మిట్టమధ్యాహ్నం వేళలో ప్రచండ నిప్పులు కక్కుతున్నాడు. ప్రస్తుత వేసవి సెలవుల్లో పోటీ పరీక్షలు, వివిధ ఎంట్రన్స్ టెస్టుల కోసం కోచింగ్‌లు తీసుకునేందుకు పట్టణ ప్రాంతాలకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే క్లాసులకు వెళ్తున్నారు. వేసవి తీవ్రత కారణంగా ఇతర వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గుముఖం పట్టగా, శీతల పానియాలు, పండ్ల రసాల దుకాణాలు మాత్రం వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి.