విజయవాడ

21వేల మందిని రోడ్డున పడేసిన ఘనత బాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక్క కలం పోటు ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసిన ఘనత మన సీఎం చంద్రబాబుకే దక్కుతుందని శాసనసభలో బీజేపీ పక్ష నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డితో కల్సి మీడియాతో మాట్లాడారు. బాబు వస్తే జాబ్ అని ప్రచారం చేసుకుని 21వేల మందిని నిరుద్యోగులను చేశారని అన్నారు. తొలగించిన ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తిరిగి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. 21వేల మంది ఉద్యోగుల ఉసురు తగులకపోతుందా అన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు చీకటిరోజు అన్నారు. సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 21వేల మంది ఉద్యోగులను తొలగించారని, ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న వారిని ఉన్న పళంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పించడం వారి పని అయితే ఆ పని కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు చేయించుకున్నారని అన్నారు. మెమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు.