పశ్చిమగోదావరి

కోడూరుపాడు రేషన్ షాపు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు, జూలై 5: మండలంలోని కోడూరుపాడు గ్రామంలోని రేషన్‌షాపు ద్వారా నిత్యావసర సరుకుల పంపిణి సక్రమంగా జరగటం లేదన్న ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. దీనిపై స్వయంగా పరిశీలన జరిపేందుకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ జెఆర్ పుష్పరాజు, సివిల్ సప్లయిస్ డైరెక్టరు జి రవిబాబు గురువారం గ్రామం వచ్చి రేషన్‌షాపును తనిఖీ చేశారు. దీంతోపాటు పాఠశాలలో మధ్యాహ్న భోజనపధకం అమలుతీరును పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. బహిరంగసభ నిర్వహించి రేషన్‌షాపు ద్వారా సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలకాలంలో అమరావతి నుంచి రేషన్‌షాపు ద్వారా సరుకులు తీసుకుంటున్న లబ్దిదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయం తెల్సిందే. ఈమేరకు కోడూరుపాడుకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ రాగా రేషన్‌షాప్ ద్వారా సరఫరా అవుతున్న పంచదార నాణ్యతపై ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం వచ్చిన పుష్పరాజ్, రవిబాబులు బహిరంగ విచారణ నిర్వహించగా కొందరు కార్డుదారులు రేషన్ షాప్ ద్వారా పంచదార నాణ్యతపై మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్టబ్రృందం లోపాలను సవరించేందుకు హామీ ఇచ్చింది. కార్డుదారులు కందిపప్పు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని డీలర్ వారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు రాయితీపై ఇస్తున్న కందిపప్పు నాణ్యమైనదని, కార్డుదారులు తీసుకోవచ్చునని సూచించారు. అనంతరం వివిధ అంశాలపై భీమడోలు మండల ఉపాధ్యక్షులు నెక్కలపూడి వీరవెంకట సత్యనారాయణ, దుద్దేపూడి సర్పంచ్ అనె్నం వీరరాఘవులు తదితరులతో చర్చించారు. అనంతరం జెఆర్ పుష్పరాజ్, రవిబాబు తదితరులు పూళ్లలోని రైస్‌మిల్లును తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ యాసిన్, విజిలెన్స్ డిఎస్పీ ఎం రజని, పౌరసరఫరాల డిఎం ఎం కొండయ్య, భీమడోలు తహసిల్దార్ ఎం గంగరాజు, సిహెచ్‌డిటి పూర్ణచంద్రప్రసాద్, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆహార కల్తీ నిరోధకశాఖాధికారులు పాల్గొన్నారు.
పజాపంపిణీ విధానానికి తూట్లు పొడిచేవారిపై కఠిన చర్యలు
రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పుష్పరాజ్
ఏలూరు, జూలై 5: రాష్ట్రంలో ప్రజాపంపిణీ విధానానికి తూట్లు పొడిచేవారిపై కఠినచర్యలు తీసుకునేందుకు పిడిఎస్ కంట్రోల్ ఆర్డర్-2018ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ జెఆర్ పుష్పరాజు తెలిపారు. ప్రస్తుతం 2008లో అమలులోకి వచ్చిన ఉత్తర్వులు మాత్రమే అమలులో ఉన్నందున అక్రమాల నిరోధానికి కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్త ఆర్డర్‌ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇది అమలులోకి వస్తే అక్రమాలకు పాల్పడే కార్డుదారులు, మధ్యదళారులు, రైస్‌మిల్లర్లు, లైసెన్స్‌డ్ ఎక్స్‌పోర్టర్లపై కూడా చట్టప్రకారం కఠినచర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్ధానిక జడ్పీ అతిథిగృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్ధను పటిష్టంగా అమలుచేసేందుకు, ఆహారపదార్ధాల్లో కల్తీ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యంగా పిడిఎస్ కంట్రోల్ ఆర్డ్‌ర్‌లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించిన కమిషన్ ఈమేరకు రాష్ట్రప్రభుత్వానికి సూచనలు చేయటం జరిగిందని, వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం త్వరలోనే పిడిఎస్ కంట్రోల్ ఆర్డర్-2018ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవలకాలంలో కాకినాడ యాకరింగ్ పోర్టు నుంచి పిడిఎస్ బియ్యం భారీస్ధాయిలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అలాగే రోడ్డుమార్గంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒరిస్సాకు బియ్యం తరలిపోతున్నట్లు గుర్తించామని, ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించామని పుష్పరాజ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న అన్నివస్తువుల్లో కల్తీ ఎక్కువైందని, దీనిపై దృష్టిపెట్టి కఠినచర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదన్నారు. దీనికికారణం చట్టంలో ఉన్న కొన్ని ఇబ్బందులేనన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని సివిల్‌సప్లయిస్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించి వంద సవరణలతో ప్రతిపాదనలతో కేంద్రానికి సిఫార్సు చేశామన్నారు. మరోవైపు కల్తీ విషయంలో కఠినచర్యలు తీసుకునేందుకు కేంద్రం కూడా సిద్దంగా ఉందని, నూతన చట్టం అమలులోకి వస్తే కల్తీకి పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవటం ద్వారా ఏడు సంవత్సరాల జైలుశిక్ష, అవసరమైతే జీవితఖైదుతోపాటు పదిలక్షల రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుందన్నారు. చట్టసవరణ త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నామన్నారు.
ప్రతి రాష్ట్రంలో స్టేట్ ఫుడ్ కమిషన్‌లను ఏర్పాటుచేయటం జరుగుతోందని, దీనిలోభాగంగా తాను ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన కమిషన్ కూడా ఇటీవలకాలంలో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజాపంపిణి వ్యవస్దను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జెఆర్ పుష్పరాజు తెలిపారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని, అంగన్‌వాడీల్లో గర్భిణీలకు, ఆరుసంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం నాణ్యతగా ఉండేలా చూడటం, మధ్యాహ్న భోజన పధకం సక్రమంగా అమలుజరిగేలా చర్యలు తీసుకోవటం, ప్రజాపంపిణి వ్యవస్ధ ద్వారా నిత్యావసర సరుకుల సక్రమ పంపిణి, మాతృవందన యోజన కింద మొదటి బిడ్డకు ఆరువేల రూపాయలు చెల్లించే కార్యక్రమం విజయవంతంగా అమలుజరిగేలా చూడటంపై దృష్టి సారించామన్నారు. ఎక్కడైనా నిబంధనల అతిక్రమణ జరిగితే కఠినచర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ఫుడ్ కమిషన్‌కు ఉందని, సివిల్ కోర్టు మాదిరిగా కమిషన్ పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పిడిఎస్ విధానంపై 40శాతం తక్కువ సంతృప్తి వ్యక్తం అవుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పిడిఎస్ విధానం సక్రమంగా అమలుజరిగేలా చూసి 95శాతం మంది సంతృప్తి చెందేలా చూసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఒకేవిధమైన మెనూ అమలుజరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పౌష్టికాహారం అందించే విషయంలో కుక్‌ల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారికి శిక్షణ అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డైరెక్టరు జి రవిబాబు, డిఎస్‌ఓ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.