బిజినెస్

బుల్స్‌దే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో గణనీయంగా 883.77 పాయింట్లు పుంజుకొని 36,541.63 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 246.25 పాయింట్లు పెరిగి, మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన 11,018.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలో సాగిన లావాదేవీల మధ్య మొత్తం మీద బుల్స్‌దే పైచేయి అయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఊగిసలాట, దేశ స్థూలార్థిక గణాంకాలు, భారత మార్కెట్ల నుంచి విదేశీ ఫండ్‌ల పెట్టుబడులు గణనీయ స్థాయిలో తరలిపోవడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు వంటి ప్రతికూల అంశాలపై ఈ వారంలో వెలువడటం ప్రారంభమయిన కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటూ పైచేయి సాధించాయి.
సెనె్సక్స్, నిఫ్టీ ఈ వారంలో తిరిగి మానసికంగా కీలకమయిన 36వేలు, 11వేల పాయింట్ల కీలకమయిన స్థాయిలను అధిగమించి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలను చేరుకోవడంతో దేశీయ మార్కెట్ల ధోరణి, గమనంలోనే మార్పులు కనిపించాయి. ప్రోత్సాహకరంగా ఉన్న అమెరికా ఉద్యోగ గణాంకాల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో పుంజుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య వివాదాలు కూడా ఈ వారంలో కాస్త తగ్గాయి. దేశీయంగా వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయికి పెరగడం, మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో పాటు కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు బాగుంటాయనే అంచనాలు మార్కెట్లను ముందుకెళ్లేలా చేశాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలు పటిష్టంగా ఉండటంతో ఈ వారంలో ఇండెక్స్ ప్యాక్‌లోని ప్రధాన సంస్థలు లాభాలు ఆర్జించాయి. చమురు నుంచి టెలికం వరకు బహుళ రంగాలకు విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ ఈ వారంలో సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ తిరిగి వంద బిలియన్ డాలర్లను అధిగమించింది.
బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారంలో 35,835.10 పాయింట్ల పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, 36,740.07- 35,779.72 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 883.77 పాయింట్ల (2.48 శాతం) పైన 36,541.63 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారంలో 234.38 పాయింట్లు (0.66 శాతం) పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ వారంలో 10,838.30 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 11,078.30- 10,807.15 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 246.25 పాయింట్ల (2.29 శాతం) పైన 11,018.90 పాయింట్ల వద్ద ముగిసింది.
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు కూడా ఈ వారంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. చమురు- సహజ వాయువు, ఐటీ, టెక్నాలజి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, విద్యుత్తు, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు ఈ వారంలో లాభపడ్డాయి. లోహ, వాహన, పీఎస్‌యూ రంగాల షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో రూ. 1,609.95 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.