బిజినెస్

దొనకొండలో రన్‌వే ఏర్పాటుకు సర్వేపూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, జూలై 16: బ్రిటీష్ కాలంలో నిర్మించిన దొనకొండ విమానాశ్రయం మళ్లీ వినియోగానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ అథారిటీ జనరల్ అసిస్టెంటు మేనేజర్ సురేష్ సోమవారం ప్రకాశం జిల్లా దొనకొండ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి సర్వే పూర్తిచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వినామాశ్రయం పరిధిలో ఉన్న స్థలం 136 ఎకరాలు మాత్రమేనని, రెవెన్యూ అధికారులు మరో 300 ఎకరాల స్థలాన్ని అప్పగించడంతో దొనకొండ విమానాశ్రయ రన్‌వే ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 1775 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే విమానాశ్రయంలోనే ఎయిర్‌ఫోర్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అకాడమీ నిర్మాణం అనంతరం దొనకొండ నుంచి విమాన రాకపోకలు కూడా ప్రారంభం అవుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన దొనకొండ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో రన్‌వే నిర్మాణం చేపడుతామని తెలిపారు.