బిజినెస్

పెట్టుబడుల దిశగా మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ముగిశాయి. రెండు నెలల గరిష్ఠ స్థాయి వద్ద సూచీలు నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గడచిన వారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ వృద్ధిరేటు అంచనాల కంటే దిగువన పయనిస్తుండటంతో వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్ళకూడదని భావించిన ఫెడ్ రిజర్వ్.. ఈ ఏడాదిలో వడ్డీరేట్ల పెంపు అవకాశాలు తక్కువేనన్న సంకేతాలనూ ఇచ్చింది. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రెండున్నర నెలల గరిష్ఠ స్థాయిలో పెరగడంతో కూడా మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లతోపాటు భారతీయ సూచీలూ లాభాల్లో కదలాడాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 234.75 పాయింట్లు పుంజుకుని 24,952.74 వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 94.15 పాయింట్లు అందుకుని 7,604.35 వద్దకు చేరాయి. ఇక గత మూడు వారాల్లో సెనె్సక్స్ 1,798.44 పాయింట్లు వృద్ధి చెందితే, నిఫ్టీ 574.60 పాయింట్లు ఎగిసింది. గడచిన వారం ట్రేడింగ్‌లో సోమవారం సూచీలు లాభాల్లో ముగియగా, మంగళవారం నష్టాల్లోకి జారుకున్నాయ. బుధవారం మళ్లీ లాభపడగా, గురువారం సెనె్సక్స్ స్వల్పంగా నష్టపోతే, నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. శుక్రవారం తిరిగి సూచీలు లాభాలను అందుకున్నాయ. మొత్తంగా చూస్తే బ్యాంకింగ్, చమురు, గ్యాస్, ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, విద్యుత్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 3.50 శాతం నుంచి 0.77 శాతం వరకు పెరిగాయి. అయితే హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, లోహ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 4.52 శాతం నుంచి 0.62 శాతం వరకు నష్టపోయాయి. బిహెచ్‌ఇఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, గెయిల్ ఇండియా, ఎస్‌బిఐఎన్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. 9.36 శాతం నుంచి 4.18 శాతం ఎగిశాయి. అయితే లుపిన్ షేర్ విలువ ఏకంగా 16.08 శాతం నష్టపోయింది. లుపిన్ గోవా ప్లాంట్‌కు సంబంధించి అమెరికా ఔషధ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ చేసిన హెచ్చరికలు దీనికి కారణం. అలాగే కోల్ ఇండియా, సన్ ఫార్మా షేర్ల విలువలు 6.71 శాతం, 5.98 శాతం చొప్పున క్షీణించాయి. ఇదిలావుంటే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) గడచిన వారం 4,580.37 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలోకి తెచ్చారు. ఇకపోతే టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,255.83 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 80,247 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారంలో బిఎస్‌ఇ టర్నోవర్ 12,518.02 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 68,942.97 కోట్ల రూపాయలుగా ఉంది.