బిజినెస్
పెరిగిన ఓఎన్జీసీ లాభాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 August 2018
న్యూఢిల్లీ, ఆగస్టు 6: చమురు మరియు సహజవాయువు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లాభాలు పెరిగాయి. ప్రీ టాక్స్ త్రైమాసిక లాభం పెరగడంతో, అప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ త్రైమాసికంలో ఓఎన్జీసీ లాభం 47.2 శాతం పెరిగింది. దీనితో ఆపరేషనల్ ప్రాఫిట్ 14,240 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పెరగడం కూడా ఓఎన్జీసీ లాభాలు ఆర్జించడానికి ఒక కారణం. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ లాభాలు పెరగడంతో, అప్పుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో లాభాల శాతం మరింతగా పెరుగుతుందన్న ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.