ఆరోగ్య భాగ్యం

ప్రాణాంతకమైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న వయసులో ఉన్న ఒక గృహిణి, హాయిగా సంసారం చేస్తున్న అమ్మాయి హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిందనుకోండి. ఒళ్లు చల్లబడి స్పృహ వస్తూ పోతూ లేస్తూ మళ్లీ పడిపోతుందనుకోండి. డాక్టర్లకి ముఖ్యంగా గైనకాలజిస్టుకి తట్టేది ప్రెగ్నెన్సీ - ఎబార్షన్ - ఎక్టోపిక్ అంటే పిండం వేరే చోట పెరగడం - పగిలిపోవడం - అనేది తప్పక మనసులోకి వస్తుంది. ఇవి కాదని తేలితేనే మిగతా కారణాలు అనే్వషిస్తారు.
అసలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. కేన్సర్ లక్షణాలు ఎలాగైతే ఎన్నో ప్రాణాలను ప్రమాదాల బారి నుంచి రక్షిస్తాయో అంతకంటే ఎక్కువ అంటే నూటికి నూరు శాతం మహిళల ప్రాణాలు కాపాడతాయి.
పిండం గర్భాశయంలో కాక వేరే చోట అంటే ట్యూబులోనో, ఓవరీలోనో పొట్టలోనో పెరగడమే దీనికి కారణం. అయితే ట్యూబు అంటే అండనాళం యొక్క పరిమాణం చాల చిన్నదిగా సున్నితంగా ఉంటుంది. ఒక నాళిక లోపలి భాగం వెంట్రుక సైజు మాత్రమే వుండి ఫలదీకరించబడిన పిండాన్ని మెల్లమెల్లగా గర్భాశయంలోనికి నెట్టుకుంటూ నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి దోహదపడతాయి. ఒక్కోసారి ఈ నాళం ఇన్‌ఫెక్షన్ బారిన పడి ఇరుకై పోయినా ముడుతలు పడినా, లేక చాల పొడవుగా వున్నా ఆ పిండం గర్భాశయం దాకా ప్రయాణించలేక మధ్యలోనే ఆగి, పెరిగి తర్వాత జాగా సరిపోక పగిలిపోయి తల్లి ప్రాణానికి ముప్పు తెస్తుంది. మధ్యలో పగిల్తే ట్యూబల్ రప్చర్ అనీ, ట్యూబులో నించి పొట్ట వైపు జారిపోతే ట్యూబల్ అబార్షన్ అనీ చెప్పాలి. రెండూ ప్రమాదమే. కాని రప్చర్ అంటే మధ్యలో పగిలిపోతే ప్రాణాపాయం ఎక్కువ. వెంటనే గుర్తించి, ఆపరేషన్ ద్వారా ట్యూబ్‌ని తొలగించకపోతే తల్లి చనిపోతుంది. ఒకటి షాక్ వల్ల రెండు రక్తస్రావం వల్ల. కనుక వెంటనే అనుమానించి పరీక్షల వల్ల ఆధునిక పద్ధతుల వల్ల అంటే అల్ట్రాసౌండ్, లాపరోస్కోపీ ద్వారా చికిత్స చేసి ప్రాణాల్ని కాపాడవచ్చు. డయాగ్నోసిస్ చాలా ముఖ్యం. ఒకసారి రక్తస్రావం ఎక్కువగాను చాలా తక్కువ వ్యవధిలోను పోతే పేషెంట్ తిరిగి రాలేనంత షాక్‌లోకి పోవచ్చు. కాబట్టి పురుష పుంగవులు తమ స్ర్తిల కడుపునొప్పిని అశ్రద్ధ చేయకుండా పై చెప్పిన లక్షణాలు డాక్టర్‌కి వివరించి తగిన సమయంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వారిని కాపాడుకోవచ్చు. ఒక స్ర్తి చనిపోయిందంటే ఒకరికి కూతురు, వేరొకరికి భార్య, పిల్లలకు తల్లి, ఒక మగవాడికి సోదరి, తోడు నీడ పోయినట్టే కదా! కొన్ని కేసులలో ఇంత హఠాత్ లక్షణాలుండకపోవచ్చు. కాని కడుపునొప్పి ఎనీమియా వుంటే తప్పక పరీక్షలు అవసరం.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో