నిజామాబాద్

కంటివెలుగు శిబిరంలో కలెక్టర్ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, ఆగస్టు 21: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని, మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కంటివెలుగు శిబిరాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు మొదటి విడతలో, ప్రారంభమైన వాటికి ప్రజలనుంచి చక్కని స్పందన వస్తుందన్నారు. రోగులను పరిశీలించ సమయంలోనిర్లక్ష్యం వహించవద్దని ఆప్తాల్మిక్ అధికారులకు ఆదేశించారు. శిభిరానికి వచ్చే రోగులకు పూర్తి సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. అవసరమైన వారికి ఆపరేషన్‌లను సైతం నిర్వహించేలా, చర్యలుతీసుకోవాలన్నారు. వైద్య శిభిరాల వద్ద తాత్కాలిక సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆవరణంలో హరితహరంలో బాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ దన్వాల్, ఎంపీడీఓ అశోక్, వైద్యాధికారి తదితరులు ఉన్నారు.

శ్రీరాంసాగర్‌లోకి 24 గంటల్లో 21 టీఎంసీల వరద నీరు
బాల్కొండ, ఆగస్టు 21: తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి గడిచిన 24గంటల్లో సోమవారం సాయంత్రం నుండి మంగళవారం వరకు 21టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నిజామాబాద్, నాందేడ్, నిర్మల్ జిల్లాలతో పాటు గోదావరిపై నిర్మించిన మహారాష్టల్రోని ప్రాజెక్టుల మిగులు జలాలు తోడు కావడంతో రిజర్వాయర్‌లోకి 2,64,715క్యూసెక్కుల భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో మంగళవారం ఉదయం 1076.60అడుగుల వద్ద ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం సాయంత్రానికి 1081.30అడుగులు 56.09టీఎంసీలకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1059.50అడుగులు 13.06టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారం నుండి నేటి వరకు రిజర్వాయర్‌లోకి 36.42టీఎంసీల వరదనీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.

16.17 అడుగులకు చేరుకున్న పోచారం ప్రాజెక్ట్ జలాశయం
నాగిరెడ్డిపేట్, ఆగస్టు 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి వల్ల ఎట్టకేలకు వర్షాలు కురుస్తుండటంతో పోచారం ప్రాజెక్ట్ నిండుకుంటున్న దిశగా పయనిస్తుంది. గాంధారి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లింగంపేట్ పెద్దవాగు భారీ స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రాజెక్ట్ జలాశయంలోకి ఇన్‌ప్లో పెరిగి మంగళవారం సాయంత్రం వరకు 16.17అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 21అడుగులు కాగా, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈనెల 10వ తేదినాటికి డెడ్ స్టోరేజీలో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు 17అడుగులకు చేరబోతోంది. 1.244టీఎంసీల నీరు ఈ వర్షాలతో ప్రాజెక్ట్ జలాశయంలోకి వచ్చి చేరింది. 1.820టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్ట్, మరో చిన్నపాటి వర్షాలు పడిన పూర్థి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 2, 117క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఉదయం 8, 700క్యూసెక్కులు ఉండగా, సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది.