నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.కంటి నదీతటంబుఁ బొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజ నురుకార్ముకమార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి, కృతార్థుఁడనైతి, నో జగ
త్కంటకదైత్యనిర్దళన! దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: లోకహింసకులైన రాక్షసులను నిర్మూలించి, దయాసముద్రుడవై యొప్పుచున్న ఓ దశరథరామా! గోదావరీ నదీ తీరాన్ని, నీకు శ్రేష్ఠమైన నివాసమైన, నీవు వేంచేసి ఉన్న భద్రాచలమనే పుణ్యక్షేత్రాన్ని దర్శించినాను. భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని చూచినాను. నీవు ధరించిన గొప్ప ధనుస్సును, బాణములను కన్నాను. నిన్ను నీ సోదరుడైన లక్ష్మణుని సేవించి ధన్యుడనైనాను. నా కోరికలు నెరవేరినవి.
వ్యా: దాశరథీ శతకాన్ని రచించి పాఠక లోకానికి సమర్పించిన కంచెర్ల గోపన్న కవి తాను బహుశా ప్రప్రథమంగా గోదావరీ నదీ తీరంలోని భద్రాచల క్షేత్రాన్ని, ఆ క్షేత్రస్వామియైన శ్రీరామచంద్రుని, ఆయన ప్రక్కనున్న సీతాలక్ష్మణులను, స్వామి ధరించి యుండిన ధనుర్బాణములను, శంఖచక్రాలను దర్శించిన మనోహర దృశ్యాన్ని ఈ పద్యంలో ఆత్మీయంగా వర్ణించినాడు. ఈ కవి వర్ణించిన భద్రాచల క్షేత్రమెట్టిది? దాని కథానికేతాలేవి? అని ఈ సందర్భంలో ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది. భద్రాచలం గోదావరీ నదీ తీరంలో రాజమహేంద్రవరానికి ఎగువ ఉత్తరంగా నూరు మైళ్ల దూరంలో (160 కి.మీ.) అడవి ప్రాంతంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఆంధ్రులకు చాల ఆదరపాత్రమైన క్షేత్రం కూడా. గోదావరి యెడమ ఒడ్డున సగం కిలోమీటరు దూరంలో భద్రాద్రి రామాలయం ఉన్నది. మేరు పర్వతుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి పుత్రుని పొంది, అతనికి భద్రుడు అని నామకరణం చేసినాడు. భద్రుడు గౌతమీనదిలో స్నానం చేస్తూ, శ్రీరాముని ధ్యానించి, రామసాక్షాత్కారం పొంది ఆ దేవుడట నివసించునట్లు వరం పొందినాడు. ఆనాటి నుండి ఆ కొండకు భద్రాద్రి అనే పేరు కలిగిందని, భద్రుని కోరికను మన్నించి శ్రీరాముడు అచట నివసించినాడని బ్రహ్మాండ పురాణం వలన తెలియవస్తున్నది.