నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.‘రా’ కలుషంబులెల్ల బయలంబడఁద్రోచిన, ‘మా’ కవాటమై
దీకొని బ్రోచు నిక్కమది ధీయుతులైనఁ దదీయవర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరుగాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ‘రామ’ అనే దివ్య నామంలోని రేఫాక్షరము, మనుజుల పాపాలను అన్నింటిని బయటికి తరుముతుంది. ఇక ఈ పేరులోని ‘మ’ అనే అక్షరం తలుపు వలె అడ్డుపడి, పాపాలను ఎదిరించి లోపలికి రాకుండునట్లు చేసి, ఆశ్రీతులను కాపాడుతుంది. ఈ విషయం యథార్థమని, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు చెప్పినప్పటికి మూఢులైనవారు, అజ్ఞానులైనవారు, ఆ అక్షరాలను (రామ అనే అక్షరాలను) గ్రహించి ఉచ్చరించజాలకున్నారు. జపింపనేరకున్నారు. అట్లు కాక, జనులు ఆ రామ అనే అక్షరాలను జపించినట్లయితే, వరుసగా వారికి ఆపదలలు కలుగనే కలుగవు. ఆపదలు వారిని సమీపించవు.

వ్యా: ఈ పద్యంలో కవి రామనామ ప్రభావాన్ని చెబుతున్నాడు. కిరాతుడుగా ఉండిన వాల్మీకి, మహర్షుల వలన రామశబ్దాన్ని గ్రహించి, నిరంతరంగా జపించి, తపించి, మహర్షిగా, మహాకవిగా లోకంలో ప్రఖ్యాతి చెందినాడు. ఇది ‘రామ’ నామ మహత్త్వమని నేరుగా చెప్పబడిలేదు. కవి ఈ పద్యం వ్రాస్తున్నప్పుడు వాల్మీకి చరిత్ర స్మరించి ఉండవచ్చు.
లోకంలో మహామంత్రాలు రెండున్నాయి. మహేశ్వరుని కొల్చేవారు నిరంతరం జపించే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం. విష్ణుమూర్తిని సేవించేవారు నిత్యం జపించే నారాయణాత్మకమైన అష్టాక్షరీ మంత్రం. దీనే్న విశిష్టాద్వైత సంప్రదాయంలో తిరుమంత్రమని అంటారు. తాత్త్వికులు, సంప్రదాయం తెలిసినవారు భావించేదేమంటే, రామనామంలో ఈ మహామంత్రాల సారం ఉన్నదని.