బిజినెస్

కేరళలో 30 గ్రామాల దత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రకృతి విపత్తుతో దెబ్బతిన్న కేరళను ఆదుకోవడానికి తమ వంతు సహాయంగా పది కోట్లను విరాళంగా ఇస్తున్నామని, అంతేకాక ఆ రాష్ట్రంలోని 30 గ్రామాలను దత్తత తీసుకుంటామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ప్రకటించింది. ఆగస్టు నెలకు సంబంధించి రుణాలు, క్రెడిట్ కార్డుల వాయిదాల మొత్తం కట్టలేని వారికి లేట్ పేమెంట్ ఫీజును రద్దు చేసినట్టు తెలిపింది. కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలను తమవంతుగా ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నట్టు బ్యాంకు ఎండి ఆదిత్య పూరి తెలిపారు. గ్రామాల దత్తతలో భాగంగా తమ బ్యాంకు ఆధ్వర్యంలో అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, దెబ్బతిన్న ఆరోగ్య కేంద్రాలు, భవనాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి సహాయపడతామని చెప్పారు. దీర్ఘకాలికంగా చేపట్టే ఈ పనులలో తమకు తోడ్పాటు అందించడానికి సేవాభావంతో పనిచేసే భాగస్వాములు అవసరమని ప్రభుత్వానికి తెలియజేసినట్టు చెప్పారు. గ్రామాల దత్తతే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంకు తరఫున 10 కోట్ల రూపాయలను అందజేసినట్టు ఆయన చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని తాము వేసి పది కోట్లను అందజేశామన్నారు. ప్రకృ తి విలయానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం త్వరగా కోలుకుని పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని తాము ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న తమ బ్యాంకు బ్రాంచిలు చాలామటుకు ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాయని, మొత్తం 331 ఏటీఎంలలో 291 పనిచేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి వసూలులో తమ బ్యాంకు కూడా సహకరిస్తోందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎండీ ఆదిత్య పూరి తెలిపారు.