బిజినెస్

తిరోగమనంలో రూపాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 31: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 26 పైసలు (0.37 శాతం) పడిపోయి, చరిత్రలో మొదటిసారి 71 వద్ద ముగిసింది. స్థూలార్థిక పరిస్థితులతో పాటు నెలాఖరు అయినందున దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. రూపాయి విలువ ఊగిసలాటను, పతనాన్ని నిరోధించడానికి వివిధ దశల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యం చేసుకుంటోందని ఆర్థిక విశే్లషకులు తెలిపారు. అయితే డాలర్‌తో పోలిస్తే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల మారకం విలువ కూడా పడిపోతుండటం వల్ల రూపాయి విలువ దిగజారడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్టు కనిపించడం లేదని వారు పేర్కొన్నారు. రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి కనిష్ట స్థాయికి పడిపోవడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలే కారణమని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రూపాయి ఇప్పటికీ వాస్తవానికి ఉండవలసినంత దానికన్నా ఎక్కువ విలువ కలిగి ఉందని, అందువల్ల దాని విలువ కొంత పడిపోవడం పట్ల ఎవరు కూడా మరీ అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేసియా కరెన్సీలు సహా ఇతర అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ ఇప్పటికీ మెరుగ్గానే ఉంటోందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా పేర్కొన్నారు. 2019 మార్చి వరకు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70-71 మధ్య కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నివేదిక ఒకటి అంచనా వేసింది.
పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి పరిస్థితి దారుణంగా ఉంది. 2018వ సంవత్సరంలో ఇప్పటి వరకు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పది శాతానికి పైగా పడిపోయింది. అధిక ముడి చమురు ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఇటీవలి కాలంలో రూపాయిని దెబ్బతీశాయి. ఒక్క ఆగస్టు నెలలోనే రూపాయి మారకం విలువ 3.7 శాతానికి పైగా పడిపోయింది. ప్రత్యేకించి ఈ వారంలో 1.5 శాతానికి పైగా పడిపోయింది.