బిజినెస్

రికార్డు గరిష్ఠానికి పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తిరిగి శుక్రవారం కూడా పెంచాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరగడంతో పాటు దేశంలో ఇంధన రవాణాపై ఎక్సైజ్ డ్యూటీ అధికంగా ఉండటం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఒక వార్తాసంస్థ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో మే 29నాటి గరిష్ఠ స్థాయి ధరలను శుక్రవారం మించిపోయాయి. పెరిగిన ధరల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.52కు చేరుకుంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.93కు చేరుకుంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.44కు, చెన్నైలో రూ. 81.58కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 70.21కి, ముంబయిలో రూ. 74.54కు, కోల్‌కతాలో రూ. 73.06కు, చెన్నైలో రూ. 74.18కి చేరుకుంది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చాయి. దేశంలోని మిగతా మెట్రో నగరాలు, చాలా రాష్ట్రాల రాజధాని నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీలో వీటిపై అమ్మకం పన్ను లేదా వ్యాట్ తక్కువగా విధిస్తున్నారు.