బిజినెస్

ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో మారుతున్న రిటైల్ వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: సరళీకృత వాణిజ్య విధానాలను ప్రోత్సహించడం వల్ల వినియోగదారులపై మంచి మార్పు కనపడుతోందని డెలాయిట్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రిటైల్ వ్యూహాలు మారుతున్నాయి. వినియోగదారులు డిజిటలీకరణ ప్రభావానికి లోనవుతున్నారు. విదేశీ పెట్టుబడులు పుంజుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
మంగళవారం ఇక్కడ రిటైల్ సీఎఫ్‌వో సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం చిల్లర, టోకు వ్యాపారాల్లో విదేశీ పెట్టుబడులు 2.7 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017-19లో ప్రపంచంలో విదేశీ పెట్టుబడీదారుల్లో 20 శాతం మంది భారత్‌ను తమ పెట్టుబడులకు అనువైన దేశంగా గుర్తించారని నివేదికలో పేర్కొన్నారు. దీనికి డిజిటల్ విప్లవం కారణమని నివేదిక పేర్కొంది.
వినియోగదారుడు లక్ష్యంగా వస్తు విక్రయాలు, అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. 32 ఏళ్ల లోపున్న యువకుల షాపింగ్ అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇ -కామర్స్, ఆన్ సేల్స్ పెరిగాయన్నారు. వౌలిక సదుపాయాలు, సప్లై చైన్ వ్యవస్థల్లో అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. 2020 నాటికి భారత్ చిల్లర వాణిజ్య రంగం సైజు 1.1 ట్రిలియన్ డాలర్కు చేరుకుంటుంది.