బిజినెస్

అదనపు పన్నులతో ‘పెట్రో’ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను అమాంతం పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో అదనపు పన్నులు పడడంతో పెట్రో మంటలు చెలరేగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకువచ్చి వెంటనే పెరిగిన ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రో ధరలు అమాంతంగా పెంచడం ఎంతమాత్రం సహేతుకం కాదని, వీటిపై టాక్స్‌లను తగ్గిస్తే ధరలు కూడా తగ్గుముఖం పడతాయని అన్నారు. పెట్రో ధరలపై ప్రస్తుతం ఉన్న టాక్స్‌ను తగ్గించాలని, వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేయాలని ఆయన సూచించారు.