బిజినెస్

మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 6: వరుసగా ఆరు సెషన్ల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి బలంగా పుంజుకున్నాయి. ఒకవైపు రూపాయి విలువ పడిపోయినప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఇటీవల ధరలు పడిపోయిన ఆరోగ్య సంరక్షణ, ఇంధన, పవర్ రంగాల షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ వచ్చింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 224.50 పాయింట్లు పుంజుకొని, 38,242.81 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 59.95 పాయింట్లు పెరిగి, 11,536.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. యూరోపియన్ స్టాక్ మార్కెట్లలో ఉదయం లావాదేవీలలో షేర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం సెషన్ చివరలో ఇటీవల ధరలు పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), సన్ ఫార్మా షేర్ల ధరలు బలంగా పుంజుకున్నాయి. గురువారం సెషన్ లావాదేవీలలో ఊగిసలాట హెచ్చు స్థాయిలో కొనసాగింది. అయితే, మదుపరులు నిర్దిష్టంగా ఎంపిక చేసుకున్న స్టాక్‌లను కొనుగోలు చేశారు. బీఎస్‌ఈలో ఓసారి కొనుగోళ్లు, మరోసారి అమ్మకాల ధోరణి ఒకటి తరువాత ఒకటి నెలకొనడంతో సెనె్సక్స్ ఊగిసలాడుతూ వచ్చింది. ఈ సూచీ 38,320.96- 37,912.50 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 224.50 పాయింట్ల (0.59 శాతం) ఎగువన 38,242.81 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ క్రితం ఆరు సెషన్లలో కలిసి 878.32 పాయింట్లు పడిపోయింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం కీలకమయిన 11,500 మార్కుకు పైన ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 11,562.25 పాయింట్ల గరిష్ఠ స్థాయిని, 11,436.05 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 59.95 పాయింట్ల (0.52 శాతం) ఎగువన 11,536.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) బుధవారం నికరంగా రూ. 176.95 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 383.67 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో రిల్ అత్యధికంగా 2.80 శాతం లాభపడింది. పవర్‌గ్రిడ్ 2.21 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో కోల్ ఇండియా, సన్ ఫార్మా, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, విప్రో, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. ఇందుకు భిన్నంగా యెస్ బ్యాంక్ షేర్ల విలువ 1.42 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ హెల్త్‌కేర్ ఇండెక్స్ అత్యధికంగా 2.20 శాతం పుంజుకుంది. ఎనర్జీ 2.12 శాతం పెరుగుదలతో, పవర్ 1.21 శాతం పెరుగుదలతో తరువాత స్థానాల్లో నిలిచాయి.