బిజినెస్

రూపాయి కదలికలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రూపాయి కదలికలు, అమెరికా- చైనా మధ్య వాణిజ్య అంశాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వంటి అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. మొహర్రం పండుగను పురస్కరించుకొని గురువారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. అందువల్ల వచ్చే వారం కేవలం నాలుగు రోజులే మార్కెట్లు పనిచేస్తాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయిలకు పడిపోతుండటం వల్ల ప్రభుత్వం దాని విలువను కాపాడటానికి శుక్రవారం కొన్ని చర్యలను ప్రకటించింది. పెరుగుతున్న కరెంటు ఖాతా లోటు (సీఏడీ)ను నియంత్రించడానికి, రూపాయి విలువను పెంచడానికి ప్రభుత్వం మసాలా బాండ్లపై విత్‌హోల్డింగ్ పన్నును ఎత్తివేయడం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లకు (ఎఫ్‌పీఐలకు) రాయితీలు కల్పించడం, అత్యవసరం కాని దిగుమతులను తగ్గించడం వంటి చర్యలను ప్రకటించింది. ‘రూపాయి మారకం విలువ తీవ్రంగా పడిపోయినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేట్ అయినప్పటికీ, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. దేశీయ కంపెనీల లాభాల వృద్ధి తిరిగి పుంజుకోవడం, మెరుగయిన ఆర్థిక గణాంకాలు, వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గడం వంటి అంశాలే దీనికి కారణం. ‘అయితే, చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం, వాణిజ్య యుద్ధాలు పెరగడం వంటివి మార్కెట్లకు ఎదురుదెబ్బలుగా నిలుస్తున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులో మార్కెట్లలో ఊగిసలాట ధోరణి నెలకొనే అవకాశాలు ఉన్నాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ‘అందరి కళ్లూ ముడి చమురు ధరల కదలిక, రూపాయి మారకం విలువ కదలికపై ఉంటాయి. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా పతనమవుతూ వచ్చిన రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు కూడా స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. సోమవారం ఆసియా మార్కెట్ల ఓపెనింగ్ ఒక ధోరణిని నెలకొల్పనున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 299 పాయింట్లు పడిపోయింది. వినాయక చవితిని పురస్కరించుకొని గురువారం స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు.