నిజామాబాద్

పౌరులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, సెప్టెంబర్ 24: 18 సంవత్సరాల వయస్సు నిండిన పౌరులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు శ్రీలక్ష్మిఅన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు, మండలంలోని పద్మాజివాడిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల భూత్‌లను ఆమెతో పాటు, జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఓటర్ల జాబితా, ఇప్పటి వరకు నమోదైన ఓటర్లు, మిగిలి ఉన్న ఓటర్ల గురించి తహశీల్‌దార్ అమీన్‌సింగ్, భూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు చూడాలన్నారు. ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ఓటు నమో దు చేయించాలని సూచించారు. 25వ తేదీ వరకు పూర్తిగా ఓటర్ల నమోదు చేయాలని ఆదేశించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆర్డీవోలు, దేవెందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, రాజేశ్వర్, ఉపతహశీల్‌దార్ రంజిత్‌కుమార్, ఎంఆర్‌ఐ విద్యాసాగర్, వీఆర్వో చెన్నరాజు, రాజ్‌కుమార్, మాజీసర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎల్లాగౌడ్, వీడీసీ అధ్యక్షుడు దశరత్, అంగన్‌డీ టీచర్లు పాల్గొన్నారు.