మెయిన్ ఫీచర్

టేస్టీ.. టేస్టీ.. ఫ్రైడ్‌రైస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పైసీ వెజిటబుల్:
----------------------
కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం:
మూడు కప్పులు
ఎండుమిర్చి: మూడు
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
అల్లం తురుము: చిన్న చెంచా
నెయ్యి: రెండు పెద్ద చెంచాలు
క్యారెట్లు: రెండు
చైనీస్ క్యాబేజీ తురుము: కప్పు
గుడ్లు: రెండు
ఉల్లికాడలు: మూడు
తాజా బఠాణీలు: 200 గ్రాములు
సోయాసాస్: ఒక చెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం:
బాస్మతి బియ్యం పొడిపొడిగా ఉడికించి ఉంచుకోవాలి. గుడ్లలో చిటికెడు ఉప్పువేసి బాగా గిలకొట్టాలి. మిక్సీలో వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా నూరాలి. బాణలిలో నూనె వేసి వేగాక, అల్లం తురుము వేసి వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించాలి. క్యాబేజీ తురుము, ఉల్లికాడల తురుము, బఠాణీలు, మిర్చి ముద్ద వేసి ఓ నిముషం వేయించాలి. సోయాసాస్ వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బాణలిలోనే ఓ పక్కకు నెట్టి గిలకొట్టిన గుడ్ల మిశ్రమాన్ని అట్టులా వేయాలి. అది రెండువైపులా బాగా కాలాక దాన్ని చిదిమినట్లుగా చేసి అన్నం మిశ్రమంలో కలిపేసి, కొత్తిమీర తురుము వేసి వేడివేడిగా వడ్డించాలి.

పనీర్‌తో..
-----------
కావలసిన పదార్థాలు

బాస్మతీ బియ్యం: మూడు కప్పులు
పనీర్ ముక్కలు: ఒకటిన్నర కప్పు
పచ్చి బఠాణీలు: కప్పు
నెయ్యి, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర: అరచెంచా
అల్లం, వెల్లుల్లి ముద్ద: టేబుల్ స్పూన్
మిరియాల పొడి: రెండు చెంచాలు
ఉల్లిపాయ: ఒకటి
కారం: పావుచెంచా
గరంమసాలా:
ముప్పావు చెంచా
నిమ్మకాయ:
సగం చెక్క
ఉప్పు: తగినంత
నూనె: చెంచా

తయారీ విధానం
పదినిముషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు సార్లు కడిగి చెంచా నూనెవేసి పొడిపొడిగా వండి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిని స్టవ్‌పై ఉంచి వెన్న, నెయ్యిని వెయ్యాలి. ఈ రెండూ కరిగాక జీలకర్ర వేసి వేయించాలి. రెండు నిముషాల తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక కారం, గరంమసాలా, పచ్చిబఠాణీలు వేసి వేయించాలి. కాసేపయ్యాక పనీర్ ముక్కలు, వండిపెట్టుకున్న అన్నం, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి దింపేయాలి.

నీలగిరి ఫ్రైడ్‌రైస్:
------------------
కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం:
మూడు కప్పులు
పుదీనా: రెండు కట్టలు
కొత్తిమీర: మూడు కట్టలు
పచ్చిమిర్చి: మూడు
జీలకర్ర:
నాలుగు చిన్న చెంచాలు
క్యారెట్: ఒకటి
బేబీకార్న్: ఆరు
ఉల్లికాడలు: నాలుగు
నూనె: రెండు పెద్ద చెంచాలు
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం
బియ్యం కడిగి పది నిముషాలు పాటు నానబెట్టి ఉడికించి పక్కన ఉంచాలి. తరువాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. క్యారెట్, బేబీకార్న్‌ను కాస్త పెద్దముక్కలుగా కోయాలి. వెడల్పాటి బాణలి తీసుకుని అందులో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన అన్నవ వేసి, ఉప్పు వేసి కలిపి దించి రైతాతో వడ్డించాలి.

గార్లిక్ రైస్:
-------------
కావలసిన పదార్థాలు

బాస్మతీ బియ్యం:
రెండు కప్పులు
సన్నగా తరిగిన పాలకూర:
నాలుగు కప్పులు
జీలకర్ర: చెంచా
ఉల్లిపాయ తరుగు: కప్పు
వెల్లుల్లి రెబ్బలు:
పదిహేను
టొమాటో తరుగు:
పావుకప్పు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్:
రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: రెండు టేబుల్ చెంచాలు

తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి పొడిపొడిగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలకూర తరుగును శుభ్రంగా కడిగి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తరువాత టొమాటో తరుగు, అల్లం, పచ్చిమిర్చి పేస్టు వేయాలి. నాలుగైదు నిముషాలు ఇవన్నీ వేయించాక ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. పాలకూరలో పచ్చివాసన పోయాక అన్నం కూడా వేసుకుని బాగా కలిపి సన్నని మంటపై వేయించాలి. అన్నం బాగా వేడయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరి.