విజయవాడ

మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 19: మద్యపానం చేసి వాహనం నడిపితే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, తిరిగి లైసెన్స్ ఇవ్వరని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈసమావేశంలో టూవీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే రూ.1100ల జరిమానా విధించడం జరుగుతుందని కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామని కలెక్టర్ పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద నేరమని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్స్‌లను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నగరంలో ఎక్కువ ప్రమాదాలు టూవీలర్ వల్లనే జరుగుతున్నట్లు గుర్తించామని దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు సంయుక్తంగా హెల్మెట్ ధరించని, డ్రంక్ అండ్ డ్రైవ్ నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనచోదకుల ప్రాణాలకు భద్రత కల్పించాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ సంవత్సరంలో 4లక్షల కేసులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారిపై నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రమాదాల విషయంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రాణాలకు భరోసా కల్పించాలని కమిటీ సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. రహదారి భద్రతలో భాగంగా గన్నవరం విమానాశ్రయ రహదారిని స్పాట్ హోల్ ఫ్రీ రహదారిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్పొరేషన్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ రహదారులను పూర్తిస్థాయిలో బ్లాక్ స్పాట్స్ లేకుండా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. యనమలకుదురు నుండి పులిగడ్డ వరకు గల కరకట్ట రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులు గుంతలు లేకుండా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గుడివాడ-పెదపారుపూడి రహదారిపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు గుర్తించామని తక్షణమే ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి ఎత్తుపల్లాలు లేకుండా లెవెలింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాతో పాటు నగరంలో కూడా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రస్తుతం 10నుండి 13శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని రానున్న నాలుగేళ్లలో జీరో శాతానికి తీసుకువచ్చేలా అన్నీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకమిటీ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ జే నివాస్, డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఈ మీరాప్రసాద్, జాయింట్ కలెక్టర్-2 పీ బాబూరావు, ఆర్‌టీసీ ఆర్‌ఎం పీవీ రామారావు, ఆర్‌డీవోలు ఉదయభాస్కర్, సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.