బిజినెస్

ఇన్నోవేషన్ వ్యాలీగా నవ్యాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్-2018లో భాగంగా పారిశ్రామిక వేత్తలతో జరిగిన ప్రత్యేక భేటీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తిచూపే వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమాజ హితానికి, దేశాభివృద్ధికి ఉపకరించే ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఐటీ ఆధారిత యాంత్రిక వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించామన్నారు. నదీ, భూగర్భ జలాలు, భూసారం, పర్యావరణం, విద్యుత్, రవాణా, నైపుణ్యతతో కూడిన మానవవనరులు వంటి అంశాలను ఈ-ప్రగతి ద్వారా అనుసంధానించి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నామన్నారు. రియల్‌టైం గవర్నెన్స్‌తో సమయం, ఖచ్చితత్వాన్ని పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీ 10.3 శాతం ఉందని, 15 శాతం సాధించడం ద్వారా తృప్తిలభిస్తుందన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన గ్రామాలను జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తే వీటిలో 55 శాతం రాష్ట్రానికి అవార్డులు దక్కాయన్నారు. విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాయకుడు గుర్తించాలని, సహజ వనరులను, విజ్ఞానంతో మిళితం చేసి అభివృద్ధి సాధించడం ద్వారానే నాయకత్వ పటిమ వెలుగుచూస్తుందన్నారు.
రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పారిశ్రామికం, విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలకు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. వౌలిక సదుపాయాలు అందించడం, వాతావరణ పరిస్థితులు తెలియపరచడం ద్వారా గతేడాది 18 శాతం వర్షాభావ పరిస్థితుల్లోనూ, 24శాతం వ్యవసాయాభివృద్ధి సాధించామన్నారు. ఈ సంవత్సరం 24 శాతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ 16 శాతం వృద్ధి ఉంటుందని భావిస్తున్నామన్నారు. రహదారుల నిర్మాణం నాణ్యతలో డ్రోన్లను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయానంద్, ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..పారిశ్రామికవేత్తలతో సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు