పశ్చిమగోదావరి

బీచ్‌లో పోలీసులు సూచించిన ప్రాంతంలోనే పర్యాటకులు స్నానాలు ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, నవంబర్ 17: పేరుపాలెం బీచ్‌లో పోలీసులు సూచించిన ప్రాంతాల్లోనే పర్యాటకులు స్నానాలు చేయాలని ఎస్పీ రవిప్రకాష్ సూచించారు. శనివారం మొగల్తూరు పోలీసుస్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి అనంతరం పేరుపాలెం బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పేరుపాలెం బీచ్‌లో కార్తీకమాస భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో తరచు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కార్తీక స్నానాలు ఆచరించే భక్తులు పోలీసులు సూచించిన ప్రాంతంలోనే స్నానాలు చేయాలని, మద్యం సేవించి స్నానాలు చేయవద్దని సూచించారు. భక్తులు సముద్రస్నానాలు ఆచరించి ఆలయాలను మాత్రమే సందర్శించుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీగౌతమి హత్యకేసులో నేరస్థులను అరెస్టు చేశామని, నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెపి పాలెం, పేరుపాలెం సమీపంలో గల ప్రమాద స్థలాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో నరసాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు, సీఐ ఎం సుబ్బారావు, ఎస్సై షేక్ మదీనాబాషా, మండల సర్పంచుల చాంబర్ మాజీ అధ్యక్షులు మేళం సోమ సత్యరంగనాధన్ (బన్ను), కెపి పాలెం మాజీ ఉప సర్పంచ్ అందె వెంకట నారాయణ (తాత) తదితరులు పాల్గొన్నారు.
అంగరంగవైభవంగా మద్ది ఆంజనేయుని గ్రామోత్సవం
జంగారెడ్డిగూడెం, నవంబర్ 17: కార్తీకమాస 25వ సప్తాహ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం నుండి రాత్రి 11 గంటల వరకు స్వయంభూ శ్రీమద్ది ఆంజనేయస్వామివారి గ్రామోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకులు, వేద పండితులు ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్దశేష వాహనం వద్దకు తోడ్కొని వచ్చి అధిష్టింప చేసారు. అనంతరం ఆలయం నుండి గురవాయిగూడెం, చక్రదేవరపల్లి, కొంగువారిగూడెం గ్రామాలలో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా భక్తుల హనుమన్నామ స్మరణల మధ్య జరిగింది. దారి పొడవునా భక్తులు స్వామివారికి పూలు, పండ్లు సమర్పించి స్వామివారి రాకతో తమ వీధులు పునీతమైనట్టు పులకించారు. మేళతాళాలు, విచిత్ర వేషధారణలు, భక్తరామదండు, భేతాళుడు, బుట్టబొమ్మలు, కార్టూన్ బొమ్మలు, లోకల్ కేరళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం ఘనంగా జరిగింది.