బిజినెస్

తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి కోలుకోవడం, దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితి మెరుగుపడటం వంటి వాటివల్ల విదేశీ మదుపరులు తిరిగి భారత క్యాపిటల్ మార్కెట్లవైపు ఆకర్షితులయ్యారు.
అక్టోబర్‌లో పెద్ద మొత్తంలో తమ నిధులను ఉపసంహరించుకున్న ఫారిన్ ఇనె్వస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ. 8,285 కోట్లు పెట్టుబడులు పెట్టారు. సుమారు రెండేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా అక్టోబర్ నెలలో భారీగా రూ. 38,900 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ మదుపరులు తాజాగా నవంబర్ నెలలో మళ్లీ భారత క్యాపిటల్ మార్కెట్లవైపు దృష్టి సారించారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెప్టెంబర్ నెలలో నికరంగా రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు జూలై, ఆగస్టు నెలల్లో కలిపి ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఐలు నవంబర్ 1-16 తేదీల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 3,862 కోట్లు, డెబిట్ మార్కెట్లలో రూ. 4,423 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మొత్తంగా రూ. 8,285 కోట్ల (1.14 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశంలోకి తాజా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయని మార్నింగ్‌స్టార్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వయిజర్ ఇండియా (ఎంఐఏఐ)లో సీనియర్ అనలిస్ట్ మేనేజర్ రీసెర్చ్ హిమాంశు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విస్తృత స్థాయిలో అస్థిరత చోటు చేసుకోవడానికి అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలే కారణమని ఆయన తెలిపారు.
ఈ రెండు అంశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా మదుపరులు రిస్క్‌ను తప్పించుకోవడానికి క్యాపిటల్ మార్కెట్లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తున్నారని ఆయన వివరించారు.డాలర్‌తో మారకంలో రూపాయి కదలికలు, ముడి చమురు ధరల ధోరణి, దేశంలో ద్రవ్యలభ్యత, త్వరలో జరుగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే సంవత్సరం జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు వంటివి ఎఫ్‌పీఐలు జాగ్రత్తగా గమనించే అంశాలలో కొన్ని’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘వీటితో పాటు చైనా, బ్రెజిల్ వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఉన్నాయి. భారత్‌తో పోలిస్తే విలువ ఆధారంగా అవి మెరుగయిన స్థానంలో ఉన్నాయి.
ఈ అన్ని కారణాలతో పాటు ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్‌లోకి ఎఫ్‌పీఐల నుంచి భారీగా పెట్టుబడులు రావడానికి ఇంకా కొంత కాలం పడుతుంది’ అని ఆయన వివరించారు. ఎఫ్‌పీఐలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 92,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వీటిలో రూ. 38,000 కోట్లకు పైగా ఈక్విటీ మార్కెట్ల నుంచి, సుమారు రూ. 54,000 కోట్లు డెబిట్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.