బిజినెస్

సింగరేణి బంగారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: సింగరేణి కాలరీస్ సంస్ధ నిజంగా బంగారమే. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్ధల్లో సింగరేణి సంస్ధ 2014-15 సంవత్సరానికి రూ. 491.90 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ విషయాన్ని కాగ్ గుర్తించి ప్రశంసించింది. నిజంగా ఇది తెలంగాణకు గర్వకారణం. రాష్ట్రంలో 11 పిఎస్‌యులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిపి రూ. 351. 62 కోట్ల నికర నష్టాలను చూశాయి. విభజన దశలో ఉన్న 33పిఎస్‌యులు రూ. 444.12 కోట్లు నికర నష్టాలు చూశాయి. 2014-15 సంవత్సరానికి లెక్కలు ఖరారు చేసిన ఆరు పిఎస్‌యుల్లో ఒక పిఎస్‌యు సింగరేణి రూ. 491 కోట్ల లాభాలను చవి చూసింది. మూడు పిఎస్‌యులు రూ. 1.35 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. రెండు పనిచేస్తున్న పిఎస్‌యులు వాణిజ్యపరమైన పనులు ఫ్రారంభించలేదు. లెక్కలు ఖరారు చేసి విభజన ప్రక్రియలో ఉన్న 22 పిఎస్‌యుల్లో 14 పిఎస్‌యులు రూ.510.27 కోట్ల లాభాన్ని ఆర్జించినవి, ఏడు పిఎస్‌యులు రూ. 1221.54 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

ఆర్జీ-2లో వంద శాతం ఉత్పత్తి
సింగరేణి జిఎం విజయ్‌పాల్ రెడ్డి వెల్లడి
యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 31: ఐదేళ్ల తర్వాత సింగరేణి నిర్ధేశించిన లక్ష్యాన్ని నూటికి నూరు శాతం సాధించామని ఆర్జీ-2 జిఎం విజయ్‌పాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రక్షణ, క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తి మెదటి నుండి దృష్టి పెట్టడం, కార్మికులు, అధికారుల సమష్టి కృషితో 100శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగలిగామన్నారు. సింగరేణిలో ఆర్జీ-2 ఏర్పడినప్పటి నుండి ఏ ఆర్థిక సంవత్సరంలో లాభాలు రాలేదని, కానీ ఈఆర్థిక సంవత్సరంలో 100కోట్ల రూపాయలు లాభం వచ్చిందని అన్నారు. తొలిసారిగా నిర్ధేశించిన 55లక్షల 90వేల టన్నుల బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. అలాగే, ఒసీపీ-3 ఫేస్-2 ప్రారంభించిన 9నెలల్లోనే బొగ్గు ఉత్పత్తి చేయడం సింగరేణి చరిత్రలోనే సరికొత్త రికార్డని తెలిపారు. ఆర్జీ-2 పరిధిలోని 2అండర్ గ్రౌండ్ మైన్లు 100శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం మరో రికార్డని, ఇలాగే సమిష్ఠి కృషితో 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన 97.9లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి వార్షిక లక్ష్యాన్ని సాధించినందుకు సంస్ధలో పనిచేస్తున్న 61వేల కార్మికులకు స్వీట్ బాక్సులను అందజేయనున్నట్లు ఆయన తెలి