బిజినెస్

కేంద్ర ప్రభుత్వంతో ఆర్బీఐ ఘర్షణ వైఖరిపై వ్యాఖ్యానించేందుకు గవర్నర్ ఉర్జిత్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వంతో రిజర్వు బ్యాంకుకు ఉన్న ఘర్షణ వైఖరిపై వ్యాఖ్యానించేందుకు ఆ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిరాకరించారు. గతంలో ఉపయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను వినియోగించడం, అలాగే ఆర్థిక మూలధన ఫ్రేంవర్క్‌పై వస్తున్న ప్రతిపాదనలపై సైతం వివరణ ఇచ్చేందుకు అయన అంగీకరించలేదు. నెలవారీ సమీక్షా సమావేశానికి హాజరైన అనంతరం బ్యాంకు విధాన నిర్ణయాలపై విలేఖరులతో ఆయన మాట్లాడారు. బ్యాంకు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు జరగని పరిస్థితుల్లో ఆయనకు మీడియా నుంచి మూడు ప్రశ్నలు ఎదురయ్యాయి. ’మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తీర్మానాలపై ప్రస్తుతం చర్చిస్తున్న దృష్ట్యా వాటిపై వ్యాఖ్యానించబోన’ని ఆయన బదులిచ్చారు. డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రిజర్వు బ్యాంకు స్వతంత్రతపై పదేపదే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గురించి అడిగిన ప్రశ్నకు గవర్నర్ బదులిస్తూ ‘ఇది ఎంపీసీ తీర్మానాలకు సంబంధించిన అంశం కాదుకదా? ప్రస్తుతం మంత్రివర్గ సమావేశ తీర్మానాలు, సూక్ష్మ ఆర్థిక విధానాలపై చర్చించేందుకు తామిక్కడికి వచ్చామ’ని ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించారు. గత అక్టోబర్‌లో రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం మధ్య వివాదం వెలుగుచూసిన తర్వాత తొలిసారిగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆర్బీఐ చట్టంలో ఇంతకుముందెన్నడూ వినియోగించని సెక్షన్-7ను స్ప్రశిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పలువురు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ప్రారంభించడంతో వివాదం ఆరంభమైన సంగతి తెలిసిందే. సెక్షన్-7 ప్రకారం సెంట్రల్ బ్యాంకును ప్రజలకు ప్రయోనకరంగా నిర్ణయాలు తీసుకునేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ మేరకు సుమారు డజను డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 10న మూడు లేఖలను రిజర్వుబ్యాంకుకు పంపడం జరిగింది. వాటికి రిజర్వుబ్యాంకు నుంచి వారంలోగా బదులు వచ్చింది. ఇందులో ప్రధానంగా నాన్‌బ్యాంకింగ్ సెక్టార్‌లోని కంపెనీలకు, ఎంఎస్‌ఎంఈలకు ద్రవ్యలోటును పూడ్చేందుకు దోహదం చేయాలన్నది ప్రభుత్వ డిమాండ్. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో నడిచే 11 బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి సైతం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అయితే రిజర్వుబ్యాంకు తటస్థంగానే అంటూ వస్తోంది. 9.6 ట్రిలియన్ రూపాయల రిజర్వుబ్యాంకు అదనపుమూలధన నిల్వలను వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఈక్రమంలో రిజర్వుబ్యాంకు గత నవంబర్ 19న జరిగిన కేంద్రబోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకించి పట్టువిడిచి ఒక మెట్టుదిగాలని, ప్రస్తుత మూలధన స్థితిగతులను పరిశీలించేందుకు, ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించి అదనంగా 25 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చేందుకు గల అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సహకరించేందుకు రిజర్వుబ్యాంకు ఓవైపు అంగీకారాన్ని తెలుపుతూనే మరోవైపు ప్రస్తుతం ఆ గత్యంతరమేదీ లేదన్న సంకేతాలనూ పంపింది. ఇందుకు సంబంధించి నియమించిన కమిటీ నివేదిక 2019 జూన్ నాటికి నివేదికను అందజేస్తుందని ఆర్బీఐ తెలిపింది. కాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వ్యాఖ్యల అనంతరం ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఆర్బీఐ స్వతంత్రతకు తాము వ్యతిరేకంగా కాదని, ఐతే ప్రభుత్వ అవసరాలనూ గమనించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.