బిజినెస్

ఇక వంట గ్యాస్‌గా మిథనాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో మిథనాల్‌ను గృహోపయోగ వంట ఇంధనంగా వాడాలని నీతి ఆయోగ్ సూచిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 20వేల నుంచి 50వేల మిథనాల్ గ్యాస్ స్టౌలు పంపిణీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ సోమవారం నాడిక్కడ తెలిపారు. ఇప్పటికే అస్సాంలోని పెట్రో కాంప్లెక్స్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా 500 గృహాల్లో మిథనాల్ కుకింగ్ స్టౌలు సరఫరా చేసి విజయవంతంగా వినియోగించడం జరిగిందని ఆయన చెప్పారు. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌తోబాటు మహారాష్ట్ర పడమటి ప్రాంతంలో (పూణే సహా) తమ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించి సంబంధిత ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నామని సరస్వత్ చెప్పారు. కాగా స్వీడన్ సాంకేతిక పరిజ్ఞానంతో మిథనాల్ గ్యాస్ స్టౌల తయారీ ప్లాంట్లను బెంగళూరు, అస్సాంలలో నెలకొల్పడం జరుగుతుందని, వాణిజ్యపరమైన వినియోగానికి సరిపడే పొడవైన స్టౌలు మాత్రం దేశీయంగా మరింత సాంకేతికత అభివృద్ధి చెందేవరకు దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు. సహజవాయువు, బొగ్గు వంటివాటి నుంచి తయారయ్యే మిథనాల్‌కు ఎలాంటి రంగూ ఉండదు.
పెట్రోలుతో కలిపి వాడేందుకు..
ప్యాసింజర్ వాహనాలకు వినియోగించే పెట్రోలుకు సైతం 15శాతం మిథనాల్‌ను కలిపి వాడేలా త్వరలో ఓ విధానాన్ని కేబినెట్ తీర్మానం ద్వారా తీసుకువచ్చేందుకు సైతం నీతి ఆయోగ్ కృషి చేస్తోందని సరస్వత్ తెలిపారు. ఇదే జరిగితే మన దేశంలో పెట్రోలు ధరలు 3నుంచి 4 రూపాయలు తగ్గుతాయని ఆయన చెప్పారు. అలాగే రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సైతం 60 బస్సులను మిథనాల్ ఇంధనం ఆధారంగా నడుపనున్నట్టు ఇప్పటికే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ ప్రత్యేక బస్సులు మరో ఆరు నెలల్లో రోడ్డెక్కుతాయని తెలిపారు. రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగం చీఫ్‌గాకూడా సరస్వత్ పనిచేశారు.
తొమ్మిది నౌకలను సైతం మిథనాల్ ఇంధనంగా నడిపేందుకు కృషి జరుగుతోందని ఆయన చెప్పారు. కోల్ ఇండియా నుంచి 14 బొగ్గు బ్లాకులను మిథనాల్ తయారీకి ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందన్నారు. 2022 నాటికి మనదేశంలో మిథనాల్ తయారీ, వినియోగం ప్రాథాన్యతను సంతరించుకుంటుందని, 10 మిలియన్ టన్నుల మిథనాల్ అప్పటి అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవాల్సివుంటుందన్నారు. ముడిచమురు కొరత సమస్యను అధిగమించేందుకు ఇది ప్రత్యామ్నాయం అవుతుందని, అధిక పొగవచ్చే బొగ్గునుంచి మిథనాల్ గ్యాస్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.