బిజినెస్

రూ.83వేల కోట్ల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రధాన మార్కెట్ల నుంచి గడచిన యేడాది 83 వేల కోట్ల రూపాయలు మదుపర్లు వెనక్కు తీసుకున్నారు. అదే క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు మదుపు చేశారు. అమెరికాలో ధరల పెరుగుదలతోబాటు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువలో తగ్గుదల పెట్టుబడులపై ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో సైతం ఈ పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని, అయితే ఈ విషయంలో మదుపర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని, దేశంలో ఆర్థిక స్థితిగతులు స్థిరంగా బలోపేతం అయ్యే వరకు కొంత వేచిచూసే దోరణిని అవలంభిస్తారని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే స్థిరమైన ప్రభుత్వంపై సైతం ఈ పడుబడుల రాక ఆధారపడి ఉంటుందని మార్నింగ్ స్టార్ ఇనె్వస్‌మెంట్స్ సలహాదారు, సీనియర్ విశే్లషకుడు హిమాంన్షు శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. 2018లో భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇనె్వస్టర్లు మొత్తం 83,146 కోట్ల రూపాయలు పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. ఇందులో రూ.33,553 కోట్లు ఈక్విటీల నుంచి రూ.49,593 కోట్ల రూపాయలు రుణ మార్కెట్ల నుంచి వెనక్క తీసుకున్నారని డిపాజిటర్ల వద్ద ఉన్న గణాంకాలు తెలుపుతున్నాయి. 2002 నుంచి ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడుల విషయంలో ఇదే అతి తక్కువ సంవత్సరంగా నిలిచింది. విదేశీ నిధులను చిన్న మార్కెట్లలోగాక, ఇతర మార్కెట్లకు మంజూరు చేయడం సైతం పెట్టుబడులపై ప్రభావం చూపిందన్నారు. గడచిన ఆరేళ్ల కాలంలో విదేశీ మదుపర్లు వరుసగా అధిక మొత్తంలో భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. 2017లో 51 వేల కోట్లు, 2016లో 20.500 కోట్లు, 2015లో 17,800 కోట్లు, 2014లో 97 వేల కోట్లు, 2013లో 1.13 లక్షల కోట్లు 2012లో 1.28 లక్షల కోట్లు వంతున పెట్టుబడులు వెనక్కు తీసుకోవడం జరిగింది. కాగా 2016లో 43,600 కోట్ల రూపాయలు వెనక్కు తీసుకున్న విదేశీ మదుపర్లు 2017లో పెద్దయెత్తున ముందుకు వచ్చి 1.5 లక్షల కోట్ల భారత మార్కెట్లలోకి పెట్టుబడులు పెట్టారు. 2018లో సైతం బాగానే ముందుకు వచ్చినప్పటికీ అంతర్జాతీయ స్థితిగతులు, ధరల ప్రభావతో పెట్టుబడుల్లో తిరోగమనం ఆరంభమైంది. మార్చిలో కొంత తేరుకున్నా వాటాల అమ్మకాలు కొనసాగుతూనే వుందని బజాజ్ కేపిటల్ సీఈవో రాహుల్ పరీక్ తెలిపారు.2008 నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా సెంట్రల్ బ్యాంకులు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ద్రవ్యాన్ని వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఇలా మరో ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.