బిజినెస్

సీఏ, సీఎస్ విద్యార్థుల కోసం లెర్న్ క్యాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ చదువుతున్న విద్యార్థులకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ పోర్టల్స్ అందుబాటులోకి రావ డం పట్ల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు స్వాగతించారు. తాను సీఏ చదువుతున్న రోజుల్లో ఇంత మం చి సదుపాయాలు లేవన్నారు. ఆయన ఒక కార్యక్రమంలో న్యూలర్న్ ఎడ్యుటెక్ ఏర్పాటు చేసిన లెర్న్ క్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఏ చదివి తా ను ప్రాక్టీసు చేసినట్లు చెప్పారు. ప్రస్తు తం సీఏ చదువుతున్న విద్యార్థులకు విస్తృతమైన మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. లెర్న్ క్యాబ్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంను ప్రధానంగా సీఏ, సీఎస్ కోర్సులను చదివే విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా కోర్సులను త్వరితగతిన అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నం ద్వారా ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏ ర్పాటు చేశారని ఆ సంస్థ తెలిపింది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో పోర్టల్‌లో మెటీరియల్‌ను అందుబాటులో ఉం టుంది. వచ్చే నెలల్లో లెర్న్ క్యాబ్ సదు పాయాన్ని లక్ష మంది విద్యార్థులకు అందిస్తామన్నారు. ఇందులో 15 వేల మంది లెక్చెర్స్ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో రవి శంక ర్ కందని, విభాకర ఆచార్య, డైరెక్టర్ ప్ర సాదరాజు తదితరులు పాల్గొన్నారు.