విజయవాడ

వీఎంసీలో ‘010’ సంబరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: విజయవాడ, విశాఖ కార్పొరేషన్లకు 010 జీవో ద్వారా ప్రభుత్వమే జీతాలను చెల్లించే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల వీఎంసీలో ఉద్యోగుల సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో శనివారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, వీఎంసీ మినిస్ట్రీరియల్ ఎంప్లారుూస్ యూనియన్ చైర్మన్ డీ ఈశ్వర్‌కు వీఎంసీ ఉద్యోగులు ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద పూలవర్షంతో డప్పుమేళాలతో ఘన స్వాగతం పలకగా, తొలుత మేయర్ పేషీకి చేరుకుని మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు జీవో కాపీని అందజేశారు. ఉద్యోగుల సంబరాలతో కోలాహలంగా మారిన వీఎంసీ కార్యాలయంలో ఉద్యోగులందరితో కలిసి వేడుకల్లో పాల్గొన్న కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ 010 జీవో అమలుతో వీఎంసీ ఆర్థిక కష్టాలే కాకుండా ఉద్యోగుల కష్టాలు కూడా తీరాయని, ఇప్పటి వరకూ వీఎంసీ ద్వారా ఉద్యోగులకు చెల్లించిన జీతాల నిధులను ఇక నుంచి నగరాభివృద్ధికి వినియోగించే అవకాశం కలగడం నగర ప్రజలకు కూడా సంతోషమన్నారు. మేయర్‌గా తాను అనేక పర్యాయాలు ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలను అందించామని, తన కృషితోపాటు ఉద్యోగ సంఘాలు కూడా తమవంతగా కీలక పాత్ర పోషించిన కారణంగా 010 అమలుపై జీవో విడుదలైందన్నారు. ఉద్యోగులకు బాసటగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకు వీఎంసీ ఉద్యోగులు కూడా అండగా నిలవాలని కోరారు. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 010 జీవో అమలుపై విడుదల చేసిన జీవో ఉద్యోగుల, వీఎంసీ, విశాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడిన కారణంగానే 15ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య నేడు పరిష్కారమవ్వడం హర్షణీయమన్న ఆయన ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వీఎంసీ మినిస్ట్రీరియల్ ఎంప్లారుూస్ జేఏసీ చైర్మన్ డీ ఈశ్వర్ మాట్లాడుతూ అపరిష్కృతంగానే కాకుండా వీఎంసీ, విశాఖలకు 010 జీవో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుకాదన్న వాదనలను తిప్పికొట్టి యూనియన్ తరఫున చేసిన పోరాటాల ఫలితం కాగా ఈవిషయంలో ఉద్యోగ, కార్మికులదే అంతిమ విజయమన్నారు. ఈవిషయంలో నిరంతర కృషి చేసిన మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు, జీవో విడుదలకు సమ్మతించిన రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినేట్ మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ జీ హరిబాబు, జేఏసీ నేతలు పేర్రాజు ఫణి, తదితరులు పాల్గొన్నారు.