విజయవాడ

రచనకు పురస్కారం కొలమానం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: రచనలకు పురస్కారాలు కొలమానం కాదని, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేవే నిజమైనవని శాసన సభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో మొగల్‌రాజపురంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి వేదికపై జరిగిన అడిగొప్పుల వెంకటరత్నం కవితా సంపుటి ‘పదండి ముందుకు’ను బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సమాజాన్ని సరైన దారిలో పెట్టేది కవి మాత్రమేనన్నారు. ప్రతిఫ లం ఆశించక, సమాజాభివృద్ధికి కాం క్షించేవాడు కవి మాత్రమేనన్నారు. తె లుగు భాష ఉన్నంతవరకూ ఆయన ర చనలు, కవిత్వం ఉంటుందని తెలిపా రు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ హించిన ఏపీ రచయితల సంఘం గౌ రవ అధ్యక్షుడు బి హనుమరెడ్డి మాట్లాడుతూ అడిగొప్పుల నిరంతరం శ్రమిస్తున్న కవి అన్నారు. అందుకు ఆయన రచించిన 21 కవితా సంపుటాలే నిదర్శనమన్నారు. నాగార్జున యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు మాట్లాడుతూ అడిగొప్పుల రాసిన కవితలపై అనేక పరిశోధనలు జరిగాయన్నారు. ఇతర భాషల్లోకి అనువాదమైన వైనాన్ని వివరించారు. కాటూరి రవీద్ర త్రివిక్రమ్, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఏపీ రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.