మెయిన్ ఫీచర్

ఆ ధైర్యం వెనుక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత్రు దేశానికి పట్టుబడినా అదే ధీరత్వం..
వెన్ను విరిగినా వెన్ను చూపని ధైర్యం..
చుట్టూ శత్రువులు ఉన్నా..
అతని ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు..
ఆ ధైర్యానికి జడిసే కాబోలు..
అతడ్ని భారతమాతకు
అప్పజెప్పాలనుకున్నారు..
ఆ మధుర క్షణం రానేవచ్చింది..
అభినందన్ సొంతగడ్డపై
అడుగు పెట్టాడు..
దేశం యావత్తూ ఆ ధీరుడికి
స్వాగతం పలికింది..
భారతమాతతో సహా ప్రతి తల్లీ
ఆ కమాండర్‌ను ఆహ్వానించింది..
ఆశీర్వదించింది..
ఈ భారతదేశ వైమానిక దళ వింగ్
కమాండర్ అభినందన్
వ్యక్తిగత జీవితంలోకి వెళితే..
వీరిద్దరూ ‘పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్’ పొందిన సింహకుట్టి వర్ధమాన్.. ఆయన ధర్మపత్ని శోభ.. ఇలా చెప్పేకంటే భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తల్లిదండ్రులు వీరు అని చెబితే అందరికీ తేలికగా అర్థమవుతుందేమో.. అభినందన్ తిరిగి స్వదేశానికి రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు.. అంటే అతడ్ని శుక్రవారం విడుదల చేస్తారు అని చెప్పగానే.. తమ కన్నబిడ్డను కళ్లారా చూసేందుకు అభినందన్ తల్లిదండ్రులు విశ్రాంత ఎయిల్ మార్షల్ ఎస్ వర్ధమాన్, శోభావర్ధమాన్‌లు కూడా గురువారం రాత్రి చెన్నై నుండి దిల్లీకి చేరుకున్నారు. అభినందన్ చూపిన ధైర్య సాహసాలకు మంత్రముగ్ధులైన మిగతా ప్రయాణీకులు.. కరతాళ ధ్వనుల మధ్య వారిద్దరినీ విమానంలోకి ఆహ్వానించారు. గౌరవసూచకంగా వారందరూ నిలబడి ఆ తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. అభినందన్ తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా తమ కుమారుడు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడని, అతన్ని చూసి గర్వపడుతున్నామని తెలిపారు ఆ తల్లిదండ్రులు.
తల్లి శోభ గురించి..
అభినందన్ తండ్రి మాత్రమే కాదు.. తల్లి కూడా సమాజ సేవకురాలే.. అభినందన్ తల్లి శోభ వైద్య నిపుణురాలు.. అంతే కాదు.. గొప్ప వీరుడిని కని.. దేశసేవ కోసం ఇచ్చిన తల్లి. యావత్ భారతదేశం పాకిస్తాన్ సైనికులకు చిక్కిన అభినందన్ గురించి ఆలోచిస్తే.. శోభ మాత్రం ‘తనకు కన్నకొడుకు ఎంత ముఖ్యమో.. దేశం కూడా అంతే ముఖ్యమని.. ఎలాగైనా నా కొడుకు తిరిగి వస్తాడు. అభినందన్ మొన్నటి వరకూ నా కొడుకు. ఇప్పుడు భరతమాత బిడ్డ’ అంటూ గుండెనిబ్బరంగా.. అంత బాధలోనూ ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్న శోభ కూడా యుద్ధ్భూమిలో క్షతగాత్రులకు వైద్య సేవలందించినవారే..
మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శోభ, పీజీ ఇంగ్లండులో చేశారు. ఫైటర్ పైలెట్ సింహకుట్టితో పెళ్లయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఆమె కూడా వివిధ ప్రాంతాల్లో వైద్యవృత్తిని కొనసాగించారు. అనస్తీషియా విభాగంలో ప్రత్యేక వైద్యనిపుణురాలిగా ఉన్న శోభ, సైనిక విభాగానికి చెందిన స్టేషన్ సిక్ క్వార్టర్స్‌లోనే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు కూడా వైద్యసహాయం అందించేవారు. రెండో గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ ప్రాంతంలోని క్షతగాత్రులకు వైద్యసేవలనందించారు శోభ. కేవలం బాధితులకే కాదు మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలోనూ పనిచేశారు. ప్రసవానంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పెద్దపీట వేయని దేశాలకు వెళ్లి వైద్య సహాయం చేసేవారు. కనీసం రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లోకి వెళ్లి ప్రసవాలు చేసేవారు. అలా శోభ కరేబియన్, ఐవరీ కోస్ట్, నైజీరియా, లిబెరియా, ఇరాన్ ప్రాంతాల్లో పనిచేశారు. శోభ గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని కూడా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా శోభ వైద్యసేవలనందించారు. ఇందుకోసం ‘డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్’లో సభ్యురాలయ్యారు. అలాగే ‘ఎయిర్‌ఫోర్స్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’కు రీజనల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారీమె. వైద్యంలో తన అనుభవాలను వీర సైనికుల భార్యలకు అందించేవారు. వైద్య, విద్య, మహిళా సాధికారత పట్ల శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించేవారు శోభ. ఇంత సేవాభావం ఉన్న శోభ కొడుకు అభినందన్ ఇలా కాక ఎలా ఉంటాడు. తండ్రిలోని దేశభక్తి, ధైర్యం.., శోభలోని సేవలకు ప్రతిఫలమే అభినందన్.. అందుకే అభినందన్ కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం పాటుపడుతున్నాడు. ఆ నిజాయితీ, అంకితభావం, మొక్కవోని ధైర్యం.. ఇవన్నీ కలగలపి అభినందన్‌గా తయారుచేసింది ఆ తల్లి. అందుకే అభినందన్ భరతమాత బిడ్డ అయ్యాడు.
సతీమణి తన్వీ
అభినందన్ భార్య తన్వీ కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసరే.. ఈమె ఓ ధీర వనిత. ప్రస్తుతం వాయుసేన విశ్రాంత అధికారి. స్వ్కాడ్రన్ లీడర్‌గా పనిచేసింది. తన్వీ కూడా ఎన్నో ఆపరేషన్లలో పాల్గొంది. శత్రువులు దేశం దరిదాపుల్లోకి రాకుండా చాలాసార్లు నిలువరించింది. ఫలితంగా వాయుసేనలో తన్వీకి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.

- సన్నిధి