బిజినెస్

రూ. 600 మిలియన్ డాలర్ల నిరర్ధక ఆస్తుల పెట్టుబడుల నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 2: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగం గురువారం 600 మిలియన్ డాలర్ల నిరర్థక ఆస్తుల పెట్టుబడి నిధులను ప్రకటించింది. ఈప్రత్యేక పరిస్థితుల నిధుల్లో అబుదాబీ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా సమకూర్చేందుకు ముందుకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన రూ.100 కోట్ల నిధులను తమ సంస్థ సమకూరుస్తుందన్నారు. ఈ నిధులను బ్యాంకుల్లో క్లాసిఫై చేసిన నిరర్ధక ఆస్తులుల్లో మదుపు చేస్తామని, అలాగే గా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల్లో కూడా మదుపుచేస్తామన్నారు. ఐతే కంపెనీలకు చెందిన నిరర్ధక ఆస్తులపై మాత్రం కాదని కోటక్ పెట్టుబడుల సలహాదార్ల విభాగం మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని శ్రీనివాసన్ స్ప ష్టం చేశారు. ఈ నిధి ఎనిమిది సంవత్సరాల పాటు కార్పొరేషనల్‌గా ఉంటుందని, అలాగే వచ్చే నాలుగేళ్లపాటు పెట్టుబడుల మో డ్‌లో ఉంటుందని ఆయన చెప్పా రు. ఈ విషయంలో సరళతరమైన దృక్పథాన్ని తాము అనురించదలిచామన్నారు. అప్పులు, నిర్మాణాత్మక రుణాలను ఈక్విటీలుగా మార్పుచే సే విషయంపై దృష్టి సారిస్తున్నామన్నారు. గతం లో కోటక్ బ్యాంకు కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్ మేనేజర్ సంస్థ సీపీపీఐబీతో వ్యాపార బంధాన్ని తెంచుకుంటున్నట్టు 2017 ఆగస్టులో మీడియా ప్రకటించింది. అప్పట్లో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూ.525 మిలియన్ డాలర్ల నిరర్ధక ఆస్తుల నిధిని ఏర్పాటు చేయాల్సివుంది. ఇదే విషయాన్ని శ్రీని శ్రీనివాసన్ దృష్టికి తేగా ప్రస్తుతం అబుదాబీ సంస్థతో ఇందుకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేశామని స్పష్టం చేశారు.