విజయవాడ

సమన్వయంతో పటిష్ట నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 23: సాధారణ ఎన్నికల నిర్వహణలో నిఘాపై జిల్లాలో ఉన్న ఆర్వోలు, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆర్వోలు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 100 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఫ్లెయింగ్ స్క్వాడ్‌ను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా అభ్యర్ధులు ఖర్చు పెట్టే వ్యయంపై దృష్టి సారించాలన్నారు. ఆదాయపన్ను శాఖాధికారులు కూడా సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, సబ్‌కలెక్టర్ మీషాసింగ్, జాయింట్ సీపీ గ్రేవాల్ నవదీప్ సింగ్, పి బాబూరావు, షేక్ సలాం, మున్సిపల్ కమిషనర్ ఎం రామారావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజకీయ పక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రచారం నిర్వహించుకోవాలని ఈసందర్భంగా సూచించారు. కోడ్ అమల్లో ఉన్నందున నిఘా బృందాలు వీడియోగ్రఫీ నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో 50 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 50 వీడియో సర్వైలెన్స్ బృందాలు, 50 చెక్‌పోస్టుల ద్వారా ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామన్నారు. పది కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని కలెక్టర్ వివరించారు.

అమరావతి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలి
* ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) డీ లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం ఏడీసీ చేపడుతున్న రహదారులు, శాఖమూరు ఉద్యానవన పనులను పరిశీలించిన ఆమె ముందుగా 32.74 కి.మీ మేర జరుగుతున్న ఎన్-7, ఈ-2, ఈ-4 రహదార్ల నిర్మాణాలను పరిశీలిస్తూ ఆయా రహదారులపై జరుగుతున్న 5వంతెనల నిర్మాణాలను రాబోయే వర్షాకాలం లోపుగా 3రహదారులను పూర్తి చేయాలన్నారు. వేసవిలో పనులు వేగంగా జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పురోగతిపై నివేదిక అందజేయాలని ఈఈ వీ లక్ష్మీనారాయణను ఆదేశించారు. అలాగే రాజధాని ప్రజలకు ఆహ్లాదం అందించే శాఖమూరు పార్కును త్వరితగతిన అందుబాటులోకి తేవాలని, ఎకో రిసార్ట్‌లో జరుగుతున్న ముఖ్యమైన కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. రోజ్‌గార్డెన్, క్రాఫ్ట్ బజారు, అడ్వంచర్ పార్కులలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్న లక్ష్మీపార్థసారథి శాఖమూరు రిజర్వాయర్, ఐనవోలు ట్యాంకుల పనులను స్వతరమే పూర్తిచేయాలన్నారు. ఈపర్యటనలో అధికారులు పీ అంకమ్మచౌదరి, బీ శ్రీనివాసులు, పీ సురేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.