బిజినెస్

ఉద్యోగ లేమిని పెంచుతున్న ప్రభుత్వ విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత అభివృద్ధి విధానం దేశంలో ఉద్యోగ లేమిని పెంచుతోందని, కార్మిక ప్రాధాన్యత కలిగిన రంగాల అభివృద్ధి విధానంలోకి మారడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు వీలుకలుగుతుందని ‘ఆక్స్‌ఫాం ఇండియా’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ‘మైండ్ ది గ్యాప్-స్టేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా’ పేరిట ఆక్స్‌ఫాం ఇండియా తన అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది. నాణ్యతతో కూడుకున్న ఉద్యోగాలు లేకపోవడంతోబాటు పెరుగుతున్న వేతన వైరుధ్యం భారత కార్మిక మార్కెట్‌లో అసమానతలకు దారితీస్తోందని ఆ నివేదిక వివరించింది. కొత్త ఉద్యోగాల కల్పిస్తున్నామని, లింగవివక్షతను రూపుమాపుమాడుతున్నామని వాక్‌చాతుర్యంతో ప్రకటించడం మినహా వాస్తవికత మరుగున పడుతోందని, ఈదిశలో సంబంధిత రంగం తీవ్ర వత్తిని ఎదుర్కోవాల్సివస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకు దారితీస్తున్న స్థానిక, నిర్మాణాత్మక చర్యలపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని నివేదిక విడుదల సందర్భంగా ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. బలహీనమైన విధాన నిర్ణయాలతోబాటు సామాజిక భద్రతపై, వౌలిక వసతులపై పెట్టుబడులు తగినంతగా లేకపోవడం కూడా ఉద్యోగ లేమికి కారణభూతం అవుతోందని బెహర్ పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల విషయంలో అసమానతలు తొలగించేందుకు ఖాళీని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్మిక దృక్పథంతో కూడిన రంగాల అభివృద్ధిపై దృష్టి నిలపాలని సూచించారు. అలాగే నైపుణ్యాలను పెంచడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలన్నారు. పన్ను విధానంలో కూడా సహేతుకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య వంటి సామాజిక భద్రతకు సంబంధించిన రంగాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. మెకనైజేషన్‌ను ప్రోత్సహిస్తూ కార్మికులకు భద్రత, ఉద్యోగాల సృష్టి వంటి చర్యలు తీసుకోకపోతే మన దేశం సామిజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం తథ్యమని ఆక్స్‌ఫాం ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ క్యాంపెయిన్స్ విభాగం డైరెక్టర్ రేణు భోగల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా మహిళా కార్మికులు మరింత ఆర్థిక సమతుల్యాన్ని అందుకోవాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఒకే పనికి ఒకే రకమైన అర్హతలున్న మహిళలు మనదేశంలో పురుషులకంటే 34 శాతం తక్కువగా వేతనాలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది.