బిజినెస్

‘అవినీతి’పై విచారణకు లభించని అనుమతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తూ, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై విచారణ జరపడం ఆలస్యమవుతున్నది. దీనితో ఏం చేయాలో తెలియక కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మల్లగుల్లాలు పడుతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐలోనూ కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 79కాగా, వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అత్యున్నత పదవుల్లో ఉండి, అవినీతికి పాల్పడినట్టు వీరిపై 41 కేసులు దాఖలయ్యాయి. అవినీతి నిరోధక విభాగాలు, ఇతరత్రా సంస్థలు సైతం వీరిని నిందితులుగా ధ్రువీకరించాయి. తదుపరి విచారణ సీవీసీ జరపాల్సి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు ఉన్నాయని, అదే విధంగా వివిధ బ్యాంకుల అధికారులపైనా కేసులు నడుస్తున్నాయని సీవీసీ ఒక ప్రకటనలో తెలిపింది.