విజయవాడ

వైభవంగా స్వామికి పవళింపుసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 20: ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు సందర్భంగా 6వ రోజైన శనివారం రాత్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామికి పవళింపుసేవ ఘనంగా జరిగింది. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఋత్వికులు దేవస్ధానం ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతుల చేత శ్రద్ధతో ఈకార్యక్రమాన్ని చేయించారు. సెక్షన్ పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పల్లకిని పుష్పాలతో అలకరించి ఉత్సవమూర్తులను ఉంచారు. ఈవో కోటేశ్వరమ్మ దంపతులను కూర్చోబెట్టి సుమారు 2గంటలకు ప్రత్యేక పూజలు చేయించి ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి పంచహారతులు నిర్వహించారు. అనంతరం ఋత్వికులు వీరికి దుర్గమ్మ దివ్య ఆశీస్సులను అందచేశారు. ఈకార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, సెక్షన్ సిబ్బంది లక్ష్మణ్, పునీత్, సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా అర్చకులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 8గంటల నుండి మూలమంత్ర హవనం, సాయంత్రం 4గంటల నుండి 6-30గంటల వరకు ఔపాసన,బలిహరణలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి హారతి పట్టారు. సాయంత్రం స్వామిసన్నిధిలో ఋత్వికులు ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతులను కూర్చోబెట్టి ద్వాదశ ప్రదక్షలు పంచ మహానాద్యం, వేదపాఠం, రుద్రసూక్తం, స్తోత్ర పాఠం, భేరి శబ్ధమ్, కాహళకం, కాంస్యనాదం, వీణానాదం, మురళీనాదం, మీనం నిర్వహించి ద్వాదశ ప్రదక్షణను విజయవంతంగా నిర్వహించి ఈవో దంపతులకు దివ్య ఆశీస్సులు అందచేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ఇంద్రకీలాద్రిపై కొలువై న దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈవో వీ కోటేశ్వరమ్మ ఆదేశాలతో నిర్వహించిన సాంస్కృతి ప్రదర్శనలు భక్తులకు విశేషంగా ఆకర్షించాయి. శనివారం సాయంత్రం శ్రీ మల్లిఖార్జున మహామండపం 7వ అంతస్తులో నాట్యా చార్య చింతా వెంకట సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో 17మంది కళకారులు ప్రదర్శించిన నృత్య రూపాలు భక్తులను ఆకొట్టుకున్నాయి. అదిగో..అల్లదినో, కృష్ణంకల్యాసఖి, మూషిక వాహన, జయ జయ నటరాజు, పౌర్ణమి, తందనానా, వింతలు వింటారా, శృంగార విహారం, క్షీరాబ్ధి, శివ శివ శంకర, తదితర వాటిని కళకారులు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జ్ పీఆర్వో కే బలరామ్ ఆదేశాలతో అసిస్టెంట్ రత్నారెడ్డి కళాకారులకు దుర్గమ్మ దర్శనం చేయించి ప్రసాదాలను అందచేయగా ఈవో కోటేశ్వరమ్మ కళాకారులను ప్రత్యేకంగా అభినందించి మెమోంటో అందచేశారు.