బిజినెస్

భారత స్టాక్ మార్కెట్‌కు ఏడోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు వరుసగా ఏడవ రోజూ నష్టాలు తప్పలేదు. గురువారం బీఎస్‌ఈలో సెనె్సక్స్ 230.22 పాయింట్లు కోల్పోయిగా, నిఫ్టీ 57.65 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా సెనె్సక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టాలపాలయింది. సెనె్సక్స్ 0.61 శాతం నష్టాలతో 37,558.91 వద్ద స్థిరపడంది. రోజంతా ఈ సూచీ హెచ్చుతగ్గులతో ఊగిసలాడింది. ఒక దశలో 37,405.40 పాయింట్ల కనిష్టానికి, మరో దశలో 37,780.46 శాతం ఆధిక్యానికి చేరింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 0.51 శాతం నష్టాలతో 11,301.80 పాయింట్ల దిగువన స్థిరపడింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సెనె్సక్స్ ప్యాక్‌లో 3.41 శాతం నష్టపోయింది. అలాగే కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ సైతం 2.53 శాతం నష్టపోయాయి. మరోవైపు ఎస్ బ్యాంక్ అత్యధికంగా సుమారు 5.94 పాయింట్లు లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ సైతం 1.65 శాతం లాభాలను సంతరించుకున్నాయి. కాగా అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు మలిదఫా చర్చలు దోహదం చేస్తాయని నమ్ముతున్న మదుపర్లకు చైనా ప్రకటన ఆశనిపాతంలా మారింది. చైనా ఉత్పత్తులపై సుంకాలను 200 బిలియన్ డాలర్లమేర దిగుమతి సుంకాలను అమెరికా పెంచితే దానిపై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని చైనా వ్యాఖ్యానించడం స్టాక్ మార్కెట్లకు మరోమారు షాక్‌లా తగిలింది. ఈ రెండు ప్రధాన వాణిజ్య శక్తుల ఆధిపత్యపోరు ప్రపంచ మార్కెట్లకు శరాఘాతం లాంటిదని వాణిజ్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఈక్రమంలో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. చైనా కాంపోజిట్ సూచీ షాంఘై 1.48 శాతం నష్టపోగా, హాంగ్‌కాంగ్ సూచీ హ్యాంగ్‌సెంగ్ 2.39 శాతం, నిక్కీ 0.93 శాతం, కోస్పి 3.04 శాతం వంతున నష్టపోయాయి. ఇక ఐరోపా దేశాల సూచీలు సైతం సెషన్ ఆరంభం నుంచే నష్టాలను చవిచూశాయి. అలాగే మనదేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం కూడా స్థిరంగా సాగుతుండటం కూడా స్టాక్ మార్కెట్లకు ఆందోళనకరంగా మారింది. విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు సుమారు రూ. 701.50 కోట్ల విలువైన వాటాలను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 232.95 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారని బుధవారం నాటి స్టాక్ ఎక్చేంజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా రూపాయి విలువ సైతం ఇంట్రాడేలో 22 పైసలు నష్టపోయి డాలర్‌తో రూ.69.93గా ట్రేడయింది. ఇక అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు 0.10 శాతం తగ్గి బ్యారెల్ ధర 70.30 డాలర్లు పలికింది.