బిజినెస్

మళ్లీ లాభాల్లోకి సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా నాలుగు రోజలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అమెరికా ఫెడరల్ రిజర్వుర్వ్ విధాన సమావేశం జరుగనన్న దృష్ట్యా మదుపర్లు ఆచితూచి అడుగేయడంతో ఆద్యం తం తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెనె్సక్స్ 85.55 పాయింట్లు, నిఫ్టీ 19.35 పాయింట్లు లాభపడ్డాయి. కాగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతోబాటు రూపాయి విలువ బలపడడంతో మొత్తం మార్కెట్లపై ఈ ప్రభావం పడిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఈక్రమంలో తొలుత బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లు ఎగబాకింది. ఐతే ఆ తర్వాత తీవ్ర అనిశ్చితికి గురై చివరికి 0.22 శాతం లాభాలతో 39,046.34 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,167.83 పాయింట్ల గరిష్టాన్ని, మరో దశలో 38,870.96 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ సైతం 0.17 శాతం లాభాలతో 11,691.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ సైతం ఇంట్రాడేలో 11,727.20 పాయింట్ల గరిష్టాన్ని, 11,641.15 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 2.65 శాతం లాభపడ్డాయి. మరోవైపుఎస్ బ్యాంక్ అత్యధికంగా 5.94 శాతం నష్టపోయింది. అలాగే మారుతి, ఆసియన్ పెయింట్స్, సన్‌పార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ 2.20 శాతం నష్టపోయాయి. కాగా జెట్ ఎయిర్‌వేస్ వాటాలు మంగళవారం 40.48 శాతం క్షీణించాయి. మూతపడిన ఈ జెట్ ఎయిర్‌వేస్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదించాలని సోమావారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించిన క్రమంలో జెట్ ఎయిర్‌వేస్ వాటాలపై ఆ ప్రభావం పడింది. ఆ ఎయిర్ లైన్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధిష్టమైన ప్రతిపాదలూ రాకపోవంతో కన్సార్టియం ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. కాగా మంగళవారం పొద్దుపోయాక యూఎస్ ఫెడ్ విధాన సమావేశం జరుగనున్న దృష్ట్యా ఆ నిర్ణయాలపై మదుపర్లు ప్రధాన దృష్టి సారించారు. స్తబ్థుగా ఉన్న సహకార ఆదాయం, రుతుపవనాల మందగింపు, వరుసగా సాగుతున్న కార్పొరేట్ సంస్థల దివాళా, ముదురుతున్న అమెరికా-్భరత వాణిజ్య ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ఇలావుండంగా ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌సంగ్, నిక్కీ, కోస్పి లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్ సూచీలు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 22 పైసలు పెరిగి 69.69 రూపాయలుగా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 0.64 శాతం తగ్గి బ్యారెల్ 60.55 డాలర్లు వంతున ట్రేడైంది.