బిజినెస్

తెలంగాణకు పరిశ్రమల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14:నగర శివార్లలోని మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీలో భగవతీ ప్రోడక్ట్స్, మైక్రోమాక్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌ఐపాస్ ద్వారా 1691 పరిశ్రమలకు అనుమతి ఇచ్చిందని, వీటి ద్వారా 20,347 కోట్ల రూపాయల పెట్టుబడితో 36,691 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు అనుమతి పొందిన పరిశ్రమల్లో 840 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించినట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీస్థాయిలో కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. టిఎస్‌ఐపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. పరిశ్రమల ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా 7306600600 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు. మైక్రోమాక్స్ కంపెనీ వ్యవస్థాపకులు రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ మైక్రోమాక్స్ తయారీ కేంద్రం ఆరు నెలల్లోనే ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు. 20 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల స్థానికంగా 650 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. మరో ఆరునెలల్లో మరో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

ఫ్యాబ్‌సిటీలో గురువారం మైక్రోమాక్స్ మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు