బిజినెస్

ఎగుమతుల ప్రోత్సాహక పథకాల సరళీకరణ..హేతుబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించిన పథకాలను హేతుబద్ధీకరించడం, సరళతరం చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా 3ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కేపిటల్ గూడ్స్2 (ఈపీసీజీ) వంటి పథకాలకు వచ్చే విదేశీ వాణిజ్య విధానంలో సరళతరం చేసి సమగ్రంగా రూపొందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈపీసీజీ పథకం ఎగుమతులను పెంచేందుకు అనువైన మార్గదర్శకాలు, రాయితీలతో కూడుకుని ఉంటుంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేందుకు అనుగుణంగా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేపట్టింది. ప్రస్తుత విధానానికి వచ్చే మార్చి 2020తో కాలం చెల్లిపోనుంది. అప్పటి నుంచి కొత్త విధానం అమల్లోకి రావాలి. ఈక్రమంలో మంత్రిత్వ శాఖ సరికొత్త సేవా చాప్టర్లను ఈదఫా విధానంలో చేర్చనుంది. ఇది 3ఈ-కామర్స్2 ఎగుమతులకు కూడా వర్తించేలా రూపుదిద్దుకోనుంది. ఈనేపథ్యంలో మరింత సరళతరంగా ముందస్తు సాధికారిత (అడ్వాన్స్ ఆథరైజేషన్), స్వయం ఆమోదిత (సెల్ఫ్ ర్యాటిఫికేషన్) పథకాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈపీసీజీ ద్వారా ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రధానంగా ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను ఇలా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపుఇలా సుంకాల రహిత పరికరాలు దిగుమతి చేసుకునేందుకు అడ్వాన్స్ ఆథరైజేషన్ సర్ట్ఫికేట్లు జారీ చేయడం జరుగుతోంది. ఇలా మూడోవ్యక్తి ద్వారా జరిగే మొత్తం ఎగుమతులను 3ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్2 కింద పరిగణించడం జరుగుతుంది. ఈక్రమంలో 3అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీం2, 3ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్ కాల వ్యవధిని ప్రస్తుతం ఉన్న 18 నెలల నుంచి మరింతగా పెంచడం జరుగుతుంది. అలాగే ఎగుమతులకు అనువైన యూనిట్లకు సంబంధించి కూడా విధాన అమలు, నియంత్రణ, పరిపాలనా పరమైన మూడు అంశాలను ఒకే గొడుగుకిందికి చేరేందుకు కృషి జరుగుతోందని ఆ అధికారి తెలిపారు. ఈక్రమంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఈ విధాన రూపకల్పనలో తలమునకలై ఉంది. ప్రస్తుతం సరకుల ఎగుమతులకు సంబంధించిన ప్రయోజనాలను 3మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్ ఇండియా స్కీం2 (ఎంఈఐఎస్) ద్వారా అందజేయడం జరుగుతోంది. అలాగే వస్తువులు, సేవారంగానికి సంబంధించిన ఎగుమతులకు 3సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీం (ఎస్‌ఈఐఎస్) ద్వారా ప్రయోజనాలను కల్పించడం జరుగుతోంది. ఈక్రమంలో అమెరికా వంటి దేశాలు ప్రస్తుత ఎగుమతి ప్రోత్సాహక పథకాలపై విమర్శలు చేయడంతో కొత్త విధానంలో ఎంఈఐఎస్, ఎస్‌ఈఐఎస్ పథకాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) నిబంధనలకు అనుగుణంగా ఈ పథకాలు లేవన్నది అమెరికా వాదన. దీంతో మళ్లీ ఇలాంటి ఆరోపణలు రాకుండా డబ్ల్యుటీవో నిబంధనలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడంపైనే మన వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ప్రధాన దృష్టి నిలిపింది. ఇలావుండగా ఎగుమతిదారులు, వ్యాపారులు మాత్రం పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన వస్తువులు, పరికరాలపై, మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మరిన్ని ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త విధానాన్ని రూపొందించాలని సూచిస్తున్నారు. చమురు, విద్యుత్ వంటి వాటిపై విధిస్తున్న ప్రత్యక్ష పన్నులను తిరిగి చెల్లించేలా చూడాలని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మండీ ట్యాక్స్ రూపంలో పన్ను విధిస్తున్నాయని లూధియానాకు చెందిన హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌సీ రాల్హన్ సూచించారు. మనదేశ ఎగుమతులు గడచిన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 2.39 శాతం తగ్గిపోయి 159 బిలియన్ డాలర్లకు చేరింది. ఐతే దిగుమతులు మాత్రం 7 శాతం పెరిగి 243.28 బిలియన్ డాలర్లకు చేరాయి.