బిజినెస్

పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలు సోమవారం భారతీయ మార్కెట్లకు కొత్త ఊతాన్ని ఇచ్చాయి. ఐటీ, మెటల్, ఆర్థిక రంగానికి చెందిన సంస్థల షేర్లు భారీగా పుంజుకోవడంతో సెనె్స క్స్ 137 పాయింట్లు పెరిగి 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 50.70 పాయింట్లు పెరిగి 11,941.30 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో ఇన్ఫోసిస్, వేదాంత, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఐసీసీఐ బ్యాంక్ షేర్లు 3.05 శాతం వరకు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ షేరు కూడా 2.48 శాతం పెరిగింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సంఘటిత నికర లాభం 76.3 శాతం పెరిగిందన్న వార్తలు హెచ్‌డీఎఫ్‌సీ షేరుపై మదుపుదార్లు దృష్టి పెట్టడానికి దారితీశాయి. కాగా, మారుతి, హీరో మోటో కార్ప్, ఇండస్‌ఇండ్, టా టా మోటార్స్ తదితర సంస్థల షేర్లు 2.54 శాతం వరకు నష్టపోయాయి. విదేశీ నిధుల్లో ద్రవ్య లభ్యత అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాల తీవ్రత తగ్గడం, కొత్త సంస్కరణలపై దృష్టి వంటి అంశాలు మర్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని, అది నేటి లావాదేవీల్లో ప్రతిఫలించాయని నిపుణులు విశే్లషించారు. షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు కూడా ఈ సానుకూల దృక్పథంతో బలపడ్డాయి. తమ మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించుకునేందుకు ఆమెరికా, చైనా ప్రతినిధులు ఓ అవగాహనకు రావడం అంతర్జాతీయా మార్కెట్ సెంటిమెంట్ బలపడడానికి దారితీస్తుంది. అలాగే, ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగానే సాగాయి. కాగా, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 7 పైసలు పెరిగి 70.73కు చేరుకుంది.