బిజినెస్

ఈ నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఈ ఏడాది ముగిసేలోగా అందరూ ఆధార్‌తో పాన్‌కార్డును అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ఆదాయ పన్ను శాఖ ఆదివారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఆదేశించింది. ఈ మేరకు ఖచ్చితమైన నిబంధనను అమలులోకి తెస్తున్నట్టు తెలిపింది. ‘భవిష్యత్తు పన్ను ప్రయోజనాలకోసం ఈ అనుసంధానాన్ని డిసెంబర్ 31లోగా పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇందుకు సంబంధించిన చివరి తేదీని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గత సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పొడిగించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పక్షం రోజుల ముందు కేంద్ర ఆదాయ పన్ను శాఖ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వినియోగదారులను తాజాగా చైతన్యవంతం చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల క్రమంలో ఈ బయోమెట్రిక్ ఆధారం ఐటీ రిటర్న్‌లకు, పాన్ మంజూర్లకు తప్పనిసరిగా అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై నుంచి పాన్‌కార్డు ఉన్న వ్యక్తులు ఆధార్‌ను పొందేందుకు అర్హులవుతారు. అలాగే ఈ ఆధార్ నంబర్‌ను పన్నుల శాఖకు ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.