విజయవాడ

పాఠశాల విద్యాశాఖ శకటం ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ పరేడ్‌ను పుష్పాలంకృతమైన ప్రత్యేక వాహనంలో గవర్నర్ పరిశీలించారు. ఏపీ స్పెషల్ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు బీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ డీఐజీ జీ విజయకుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు గ్రేహౌండ్స్ అసాల్జ్ కమాండర్ వీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వం వహించారు. పరేడ్‌కు రెండవ కమాండెంట్‌గా ఏపీఎస్పీ 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పీవీ హనుమంతు వ్యవహరించారు. ఈ సందర్భంగా పరేడ్‌లో అత్యుత్తంగా నిలిచిన భారత సైనిక దళం తరపున సుబేదార్ ముఖేష్ చౌదరి, తెలంగాణ రాష్ట్ర పోలీసు బృందం తరపున నవనీత్‌కుమార్, బాలికల ఎన్‌సీపీ బృందం తరపున ఏ జీవనజ్యోతి, ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బృందం తరపున కంటిపూడి అనిల్‌కుమార్‌కు గవర్నర్ అవార్డులు, మెమెంటోలు అందజేశారు. ఇక ప్రదర్శితమైన శకటాల్లో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దిశ చట్టం, వ్యవసాయ శాఖ శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కే బాలశౌరి, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, సీపీ ద్వారకాతిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.