విజయవాడ

అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ జరుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 23: గత ప్రభుత్వమంతా దోపిడీగా మారిందని, కార్మికుల చెమటను కూడా టీడీపీ నాయకులు దోచుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్‌లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు హయాంలో జరగని స్కాం లేదని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ స్థలాన్ని గోదాముగా అద్దెకు ఇచ్చిన ఘనత అచ్చెన్నాయుడుకి దక్కిందన్నారు. ఆ ఇద్దరి దోపిడీపై విచారణ జరిపించి నిధులు రాబడతామని మంత్రి అన్నారు. అమరావతి అభివృద్ధి, నగరాభివృద్ధి కాగితాలకే పరిమితం చేశారని వాస్తవ రూపంలో ఎలాంటి అభివృద్ధే జరగలేదని ఘాటుగా విమర్శించారు. తొలుత 26వ డివిజన్‌లో పార్థసారథి వీధిలో రూ. 18.06 లక్షలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం 27వ డివిజన్‌లోని భవానీపురంలోని ప్రెసిడెంట్ వీధిలో రూ. 10.84 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకి శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్‌లో హెచ్‌ఆర్‌బీ బిల్డింగ్ రోడ్డు, హెచ్‌బీ కాలనీలో రూ. 19.84 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అలాగే 29వ డివిజన్‌లో రిలయన్స్ మార్కెట్ పక్కన గల రోడ్డు నిర్మాణానికి రూ. 14.84 లక్షల వ్యయాన్ని మంజూరు చేయగా దాని క్కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వైకాపా నగర కార్యదర్శి కోనాల వంశీకృష్ణ, సీనియర్ నాయకులు మైలవరం దుర్గారావు, పోలిరెడ్డి, మద్దెల రామకృష్ణ, మాగం ఆత్మారామ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అండగా నిలవాలి
* టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: డివిజన్లలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గ ప్రజా చైతన్య యాత్ర నిర్వహణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించిన వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్‌మీరా మాట్లాడుతూ చైతన్యవంతమైన కార్యకర్తలు కలిగిన తెలుగుదేశం పార్టీలో నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా నిలిచే శ్రేణులు ఉండటం అభినందనీయమన్నారు. ప్రజా చైతన్యయాత్రల ద్వారా ప్రజాభిమానాన్ని పొందాలని సూచించారు. నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, మాజీ ఫ్లోర్ లీడర్లు గుండారపు హరిబాబు, కొట్టేటి హనుమంతరావు, పరిశపోగు రాజేష్, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.