గుంటూరు

మంచినీటి కోసం ఏ పోరాటానికైనా సిద్ధం: అప్పిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మే 17: సాగు, మంచినీటి కోసం ఏ పోరాటానికైనా, ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పష్టంచేశారు. కృష్ణానదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిరసనగా వైసిపి అధినేత జగన్ కర్నూలు వేదికగా చేపట్టిన జలదీక్షకు మద్దతుగా వైసిపి నగర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లతో, ఆడలేక మద్దెల ఓడు అన్న రీతిలో ప్రవర్తిస్తున్న చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికో తాము అదిరేదీ, బెదిరేదీ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కృష్ణానది కెసిఆర్ సొత్తు కాదని, తెలంగాణ కూడా తమ సొంత జాగీరు అన్న రీతిలో టిఆర్‌ఎస్ వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం తాండవిస్తుందని, అక్రమ ప్రాజెక్టులతో పూర్తి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. బాబు కళ్లుతెరిచి స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ నీరు-చెట్టు, ఇంకుడుగుంతలు, రాజధాని పేరిట నాటకాలు ఆడటం తప్ప తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనలతో చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో తమ పార్టీకి ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనతో ఆ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బాబు అడ్డుకోవడం లేదన్నారు. దీక్షలో నాయకులు నసీర్ అహ్మద్, కిలారి రోశయ్య, పోలూరి వెంకటరెడ్డి, అంగడి శ్రీనివాసరావు, పి చైతన్య బండారుసాయి, కొత్తా చిన్నపరెడ్డి, అత్తోట జోసఫ్, సోమి కమల్, రబ్బాని, వినోద్, వలి పాల్గొన్నారు.

*