భక్తి కథలు

హరివంశం 162

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయననప్పుడు సందర్శించటానికి దేవతలు, మునులూ వచ్చారు. ఆ మహర్షులలో వ్యాస, భరద్వాజ, వాల్మీకి, గౌతమ, కాశ్యప, జాబాలి, కణ్వ, పులహ, యజ్ఞవల్క్య, అత్రి, రైభ్య మహర్షులతోపాటు అంగిరస, భృగు, పరాశర, ధూమ్ర, గాలవ, శంఖలిఖిత, హరిత, సంవర్తక, హయశిర, శౌనక, భాద్ర, కక్షీవంతులేకాక విభాండక, ఉగ్రశ్రవస్, బకదాల్భ్య, కౌశిక, ఆపస్తంబ, మాండవ్య, మంకణ, రోమశ, మందపాల, కఠ, కలాప, రోహిత, కామకాయన మహర్షులు, చిరకాల తపోనిష్ఠాగరిష్ఠులు ఏతెంచారు. అట్లా ఆదిదేవుణ్ణి, అభవుణ్ణి, అచుత్యుణ్ణి వాళ్ళు చూడటానికి వచ్చి ‘దేవా! మేము ధన్యులము, మా తపస్సు ఈ విధంగా ఫలించింది. దేవర వారి రాకకు మేమెట్లా ఉపచరించాలి?’ అని సంప్రహృష్ట మనస్కులైనారు. భక్త్యాదర వచస్కులైనారు.
అప్పుడు ప్రభువు వారందరి యోగక్షేమాలు, కుశల కర్మలను గూర్చి తెలుసుకున్నాడు. సాయం సంధ్యానుష్ఠానాలు ముగిసిన తర్వాత ఋష్యాశ్రమాలవారు ఆయనకు విందు చేశారు. అర్ధరాత్రివరకు వారంతా ఆయనతో ఇష్టాగోష్ఠిలో గడిపారు. అప్పుడాయన శయనించాడు. కాని ఆయనకు నిద్ర రాలేదు. తను పూర్వం తపస్సు చేసిన ఈ బదరికావనాన్ని ఆయా పవిత్ర స్థలాలను చూడాలని ఆయనకు వేడుక కలిగింది.
అక్కడ నుంచి ఆయన గంగ ఉత్తరపు ఒడ్డుకు వెళ్ళాడు. ఆ చుట్టుపట్ల అడవులలో తపస్సు చేసుకుంటున్న మున్యాశ్రమాలు చూస్తూ ఆనందించాడు. సిద్ధచారణులు, కిన్నరులు, గంధర్వులు విహరించే ఆ సుందర శైలశృంగాలు, రమ్యకానన వనాలు ఆయనకు ఆనందకరంగా, ఆకర్షణీయంగా తోచాయి. అక్కడ ఒక రమణీయ ప్రదేశం కనపడింది ఆయనకు. అప్పటికి అపర రాత్రమైంది. అది యోగ సమాధిననుభవించటానికి అనువైన వేళ.
అక్కడ స్వస్తికాసనంలో కూచుని యోగ సమాధి నిష్ఠుడైనాడు కృష్ణుడు. ఆ పరమ యోగీశ్వరుడు యోగ సమాధిలో కుండలిని సహస్రారం చేర్చి అమృతానంద మకరంద బిందువులను ఆస్వాదించి పరమానంద విలోలుడైనాడు. అణిమాద్య ఖిలసిద్ధులను అనుగ్రహించే పరమేశ్వరుడు వాటిని అతీత స్థితిలో తనను తానే ఉపాసించుకున్నాడు.
ఇంతలో ఆ అడవి అంతటా పెద్ద కలకలం బయలుదేరింది. బెబ్బులులు, అడవి పందులు, ఇతర క్రూరమృగాలు నలుదెసలా బెదిరి చెదరి పరుగులు తీశాయి. వాటి వెనుక గుంపులు గుంపులుగా వేట కుక్కలు వాటిని తరుముతున్నాయి. ఈ వేట కుక్కల వెనుక ఒక పెద్ద పిశాచగణం మాంసఖాదనం, రుధిరపానం చేస్తూ కేరింతలతో బొబ్బలతో కేకలతో ఆడుతూ పాడుతూ వస్తున్నారు. వాళ్ళతోపాటు ఆడ పిశాచాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కడుపులు డొక్కలకు అంటుకుపోయి ఉన్నాయి. ఎముకల పోగుల్లో కన్పిస్తున్నారు.
శిశువులను ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళ శరీరాలు నల్లగా ఉన్నాయి. వెంట్రుకలు శరీరం నిండా నిక్కబొడుచుకుని ఉన్నాయి. ప్రేవులు వడ్డాణంలాగా నడుముచుట్టూ చుట్టుకుని ఉన్నారు. ఈ గుంపులో నాయకుడు మధ్య మధ్య జయ జగదీశ హరే కృష్ణ నిగమస్తుత అని పాట చరణం అందుకుంటున్నాడు. ఈ నాయకుడి పక్కనే ఇటువంటి వాడే ఇంకొకడున్నాడు.
వీళ్ళ వెంట్రుకలు బూడిద ఎరుపు రంగుతో ఉన్నాయి. ఇట్లా వస్తున్న వీళ్ళ సంఖ్య చాలా పెద్దది. మిడిగుడ్లు ముందుకు పొడిచినట్లుగా ఉన్నాయి వీళ్ళవి. కళ్ళు కపిల వర్ణనంగా ఉన్నాయి. తెల్లని తెలుపుతో పండ్లు మిట్టపల్లాలుగా ఉన్నాయి. రొమ్ములు చాలా చదుగా ఉన్నాయి. చేతులు చాలా కురచగా ఉన్నాయి వీళ్ళవి.

ఇంకా ఉంది